తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన లేడీ కమెడియన్ | Tamil Actress Indraja Shankar Pregnancy News | Sakshi
Sakshi News home page

Indraja Shankar: రీసెంట్‌గా పెళ్లి.. ఇంతలోనే శుభవార్త చెప్పేశారు

Aug 10 2024 12:08 PM | Updated on Aug 10 2024 12:33 PM

Tamil Actress Indraja Shankar Pregnancy News

ప్రముఖ లేడీ కమెడియన్ శుభవార్త చెప్పేసింది. తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో విషయాన్ని ఇన్ స్టా వేదికగా బయటపెట్టింది. ఈ క్రమంలోనే పలువురు నటీనటులు, ఫాలోవర్స్ ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: పెళ్లి బంధానికి పూర్తి న్యాయం చేశా.. కానీ: సమంత)

ప్రముఖ తమిళ నటుడు రోబో శంకర్ కూతురే ఇంద్రజ శంకర్. దళపతి విజయ్ 'బిగిల్' (తెలుగులో 'విజిల్') సినిమాతో నటిగా మారిన ఈమె.. బాగానే గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాత విశ్వక్ సేన్ 'పాగల్', కార్తీ 'విరుమాన్' చిత్రాల్లోనూ ఇంద్రజ సహాయ పాత్రలు చేసింది. ప్రస్తుతం టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది.

ఈ ఏడాది మార్చిలో కార్తీక్ అనే దర్శకుడిని పెళ్లి చేసుకున్న ఇంద్రజ.. ప్రస్తుతం తాను గర్భవతి అయినట్లు ప్రకటించింది. ఈ విషయం తెలియగానే ఎమోషనల్ అయిపోయానని, మాటలు రావట్లేదని ఇన్ స్టాలో రాసుకొచ్చింది. లవ్ మామ అని భర్తని ఉద్దేశించి తెగ ప్రేమ కురిపించింది.

(ఇదీ చదవండి: నిన్న ఎంగేజ్‌మెంట్.. ఇ‍ప్పుడు పెళ్లిలో కనిపించిన నాగచైతన్య)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement