కమెడియన్‌ కూతురి నిశ్చితార్థం.. నెల రోజుల్లో పెళ్లి! | Robo Shankar's Daughter Indraja got engaged to Director Karthik - Sakshi
Sakshi News home page

Indraja Shankar: 20 ఏళ్లకే ప్రముఖ కమెడియన్‌ కూతురి పెళ్లి.. ఘనంగా నిశ్చితార్థం..

Published Sat, Feb 3 2024 4:52 PM | Last Updated on Sat, Feb 3 2024 5:17 PM

Robo Shankar Daughter Indraja Wedding with Director Karthik - Sakshi

తెలుగులో పాగల్‌ అనే సినిమా చేసింది. ఇందులో .ఈ సింగిల్‌ చిన్నోడే..' అనే పాటలో మాత్రమే కనిపిస్తుంది. కార్తీ 'విరుమాన్‌' మూవీలో హీరోయిన్‌ అదితి శంకర్‌ స్నేహితు

తమిళ కమెడియన్‌ రోబో శంకర్‌ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అతడి కూతురు ఇంద్రజకు డైరెక్టర్‌ కార్తీక్‌తో నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 2న చెన్నైలో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఈ శుభకార్యానికి ఇరు కుటుంబాలు సహా అతి దగ్గరి బంధుమిత్రులు హాజరయ్యారు. తన ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలను ఇంద్రజ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నెల రోజుల్లోనే వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

విజిల్‌, పాగల్‌ సినిమాల్లో..
ఇందుకోసం రోబో శంకర్‌ భారీ ఎత్తున ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. చెన్నైలో జరగబోయే ఈ వేడుకకుగానూ సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంద్రజ.. విజయ్‌ హీరోగా నటించిన బిగిల్‌(తెలుగులో విజిల్‌ పేరిట రిలీజైంది) మూవీలో ఓ ముఖ్య పాత్ర పోషించింది. తెలుగులో పాగల్‌ అనే సినిమా చేసింది. ఇందులో .ఈ సింగిల్‌ చిన్నోడే..' అనే పాటలో మాత్రమే కనిపిస్తుంది. కార్తీ 'విరుమాన్‌' మూవీలో హీరోయిన్‌ అదితి శంకర్‌ స్నేహితురాలిగా నటించింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేసే ఆలోచనలో ఉంది ఇంద్రజ.

ఎవరీ రోబో శంకర్‌..
ఆమె తండ్రి రోబో శంకర్‌ విషయానికి వస్తే.. ఇతడు రోబో డ్యాన్స్‌తో ఫేమస్‌ అయ్యాడు. అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది. తనకు వచ్చిన మిమిక్రీతో సినిమాల్లో అడుగుపెట్టాడు. నెమ్మదిగా ఒక్కో సినిమా చేసుకుంటూ పోయాడు. కెరీర్‌ ప్రారంభించిన పదేళ్ల తర్వాతే అతడికి మంచి బ్రేక్‌ వచ్చింది. 'ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార' అనే చిత్రంతో అందరి కళ్లలో పడ్డాడు. అప్పటివరకు ఏడాదికి ఒకటీరెండు సినిమాలు చేసే ఇతడు ఈ చిత్రం సక్సెస్‌ తర్వాత ఏకంగా 10 సినిమాలు చేసే స్థాయికి ఎదిగిపోయాడు. దాదాపు తమిళ స్టార్‌ హీరోలందరితోనూ కలిసి పని చేశాడు.

చదవండి: భర్తతో కలిసి ఉదకశాంతి పూజ చేసిన గీతా మాధురి..
ఆమిర్‌తో, అతడి మాజీ భార్యతో.. నా రిలేషన్‌ ఎలా ఉందంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement