
తమిళ నటుడు రోబో శంకర్ ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి. అతడి కూతురు ఇంద్రజ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. తనకు కాబోయే భర్తను సోషల్ మీడియాలో అభిమానులకు పరిచయం చేసింది. డైరెక్టర్ శంకర్‌తో తరచూ రీల్స్ చేస్తున్న ఇంద్రజ అతడితోనే ఏడడుగులు వేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గుడిలో ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు మీరు పెళ్లి చేసుకున్నారా? అని అడిగారు. దీనికి ఇంద్రజ స్పందిస్తూ.. పెళ్లికి ఇంకా ముహూర్తం పెట్టలేదని, ఆ పని పూర్తవగానే త్వరలోనే వెడ్డింగ్ డేట్ చెప్తానంది.
కాగా ఇంద్రజ బిగిల్(తెలుగులో విజిల్) సినిమాలో ఫుట్‌బాలర్ పాండియమ్మగా నటించింది. ఇందులో ఆమె నటించిన కామెడీ, సెంటిమెంట్ సీన్లకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఆమె సర్వైవర్ అనే షోలోనూ పాల్గొంది. ప్రస్తుతం ఆమె కార్తీ విరుమాన్ సహా పలు సినిమాలతో బిజీగా ఉంది ఇంద్రజ. ఆమె తండ్రి రోబో శంకర్ కళక్క పోవదు యారు, అడు ఏడు ఈడు వంటి కామెడీ షోలలో మెరిశాడు. ఇదర్కు తానే ఆశైపట్టై బాలకుమార, వేలైను వందుత వేళ్లైకారన్, ఇరుంబు తిరై, విశ్వాసం, అన్నాత్తే చిత్రాలతో వెండితెరపైనా మెరిశాడు.
చదవండి: పంజాబ్‌ను ఓ ఊపు ఊపిన సింగర్, ఇప్పటికీ వీడని హత్య మిస్టరీ
Comments
Please login to add a commentAdd a comment