కమెడియన్‌ ఇంట వేడుకలు.. బెస్ట్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన నటి | Indraja Shankar Gets Married To Her Best Friend Karthick, Wedding Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Indraja Shankar: కమెడియన్‌ ఇంట పెళ్లి.. 20 ఏళ్లకే నటి వివాహం

Published Sun, Mar 24 2024 7:20 PM | Last Updated on Mon, Mar 25 2024 9:14 AM

Indraja Shankar Gets Married to Karthick; Pics Inside - Sakshi

కమెడియన్‌ రోబో శంకర్‌ ఇంట పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. అతడి కూతురు, నటి ఇంద్రజ పెళ్లిపీటలెక్కింది. 20 ఏళ్ల వయసులో తన క్లోజ్‌ఫ్రెండ్‌, డైరెక్టర్‌ కార్తీక్‌తో ఏడడుగులు వేసింది. ఫిబ్రవరి 2న ఎంగేజ్‌మెంట్‌ జరగ్గా ఆదివారం (మార్చి 24న) వీరి వివాహం కన్నులపండగ్గా జరిగింది. చెన్నైలో జరిగిన ఈ శుభకార్యానికి ఇరు కుటుంబసభ్యులతో పాటు బంధుమిత్రులు, సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

గోరుముద్దలు..
'దేవుడి ఆశీస్సులతో పెద్దల సమక్షంలో మనం ఒక్కటయ్యాం' అంటూ పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇంద్రజ శంకర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అలాగే పెళ్లి తర్వాత గోరుముద్దలు తినిపించుకున్న వీడియో సైతం పోస్ట్‌ చేసింది. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ఇంద్రజ.. తమిళ రియాలిటీ షో 'సర్వైవర్‌'తో గుర్తింపు పొందింది. తర్వాత బిగిల్‌(విజిల్‌) సినిమాలో నటించింది. తెలుగులో విశ్వక్‌ సేన్‌ 'పాగల్‌' మూవీలో 'ఈ సింగిల్‌ చిన్నోడే..' పాటలో కనిపించింది. కార్తీ 'విరుమాన్‌' చిత్రంలోనూ హీరోయిన్‌ అదితి శంకర్‌ స్నేహితురాలి పాత్రలో యాక్ట్‌ చేసింది.

స్టార్‌ హీరోలతో నటించిన కమెడియన్‌
ఆమె తండ్రి విషయానికి వస్తే.. రోబో డ్యాన్స్‌తో ఫేమస్‌ అయినందున శంకర్‌ కాస్తా రోబో శంకర్‌ అయ్యాడు. మిమిక్రీతో కెరీర్‌ ఆరంభించిన అతడు ఎప్పుడోగానీ సినిమాల్లో కనిపించేవాడు కాదు. 'ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార' సినిమాతో అందరి కంట్లో పడ్డాడు. ఈ మూవీ ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఏడాదికి పది సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. కోలీవుడ్‌లో దాదాపు అందరు హీరోలతోనూ నటించాడు.

చదవండి: బాలీవుడ్‌ స్టార్స్‌.. తెలుగు సినిమాలకు ఎంత తీసుకుంటున్నారో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement