తమిళ హాస్యనటి శర్మిలి 48 ఏళ్ల వయసులో గర్భం దాల్చింది. 40 ఏళ్ల వయసులో ఐటీ ప్రొఫెషనల్‌ను పెళ్లి చేసుకున్న ఆమె తల్లిగా ప్రమోషన్ పొందే రోజు కోసం ఎదురు చూస్తోంది. నటి వనితా విజయ్ కుమార్.. శర్మిలిని ఇంటర్వ్యూ చేయగా ఆమె ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. తన భర్త ఓపక్క ఐటీరంగంలో పనిచేస్తూనే మరో పక్క లాయర్‌గానూ విధులు నిర్వహిస్తున్నాడంది. అలాగే లాయర్ నుంచి జడ్జిగా మారేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాడని చెప్పుకొచ్చింది.
ఏ విషయంలోనైనా భర్త అండగా ఉంటాడని చెప్తున్న కమెడియన్.. తనకు డెలివరీ అయిన తర్వాత తిరిగి సినిమాలు, సీరియల్స్‌లోకి రీ ఎంట్రీ ఇస్తానని చెప్తోంది. ఈ నిర్ణయంపై వనితా విజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేసింది. అలాగే 48 ఏళ్ల వయసులో తనకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకుంటున్న శర్మిలిని అభినందించింది వనిత.
చదవండి: యాసలందు అన్ని యాసలు లెస్స
Comments
Please login to add a commentAdd a comment