![Rao Ramesh To Play Lead Role In Maruti Nagar Subramanyam - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/24/rao-ramesh.jpg.webp?itok=lN3gh3CV)
విలక్షణ నటుడు రావు రమేష్ హీరోగా మారాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’. పీబీఆర్ సినిమాస్ సంస్థ ప్రొడక్షన్ నంబర్ 2గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో నటి ఇంద్రజ కీలక పాత్ర పోషిస్తున్నారు. 'హ్యాపీ వెడ్డింగ్' ఫేమ్ లక్షణ్ కార్య ఈ చిత్రానికి దర్శకుడు. ఈ రోజు(ఫిబ్రవరి 24) సినిమాను అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్బంగా దర్శకుడు లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ..వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. రావు రమేష్ లీడ్ రోల్ చేయడానికి అంగీకరించడం మా ఫస్ట్ సక్సెస్. కథ నచ్చి ఆయన ఓకే చేశారు. నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగి జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులతో రెండు గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం' అని చెప్పారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment