12 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ మలయాళ సినిమాలో కనిపించబోతున్నారు ఇంద్రజ. ‘యమలీల, అమ్మ దొంగ, చిలక్కొట్టుడు, పెద్దన్నయ్య’ సినిమాలతో ఇంద్రజ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మనకు తెలిసినంతగా మలయాళ ప్రేక్షకులకు కూడా ఆమె పరిచయమే. 1999లో ‘ది గాడ్‌మేన్’ అనే సినిమా ద్వారా మలయాళంలో ఎంట్రీ ఇచ్చారు ఇంద్రజ. మోహన్‌లాల్‌తో ‘ఉస్తాద్’, సురేశ్ గోపీతో ఓ సినిమాలో నటించారామె. ‘నందలాలా, ఇండిపెండెన్స్ డే’ సినిమాలు నటిగా ఆమెకు మలయాళంలో మంచి పాపులారిటీ సంపాదించి పెట్టాయి. 2007లో చేసిన ‘ఇంద్రజిత్’ తర్వాత మళ్లీ మలయాళ స్క్రీన్‌పై కనిపించలేదు ఇంద్రజ. 12 ఏళ్ల విరామం తర్వాత తాజాగా ‘12 సి’ అనే సినిమాలో నటించనున్నారామె. ఈ చిత్రానికి ఉన్ని కృష్ణన్ దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment