
నిత్యామీనన్
గతంలో హీరోహీరోయిన్లు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసి యాభై, వంద, నూటయాభై మైలురాళ్లు సులువుగా దాటేసేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 50వ సినిమా మైలురాయిని అందుకున్నారు నిత్యామీనన్. మలయాళంలో నిత్యామీనన్ చేయబోతున్న ‘ఆరామ్ తిరుకల్పన’ తన 50వ సినిమా. ఈ సినిమాలో నిత్యా పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోందని సమాచారం. సెప్టెంబర్ నెలాఖరున ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 1998లో ‘ది మంకీ హూ న్యూ టూ మచ్’ అనే ఇంగ్లీష్ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన నిత్యామీనన్ కథానాయికగా మారి, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. 2008లో హీరోయిన్‌గా మలయాళ సినిమా చేశారు. 2010లో ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగుకు పరిచయం అయ్యారు. ‘మిషన్ మంగళ్’తో ఈ ఏడాదే బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment