
అజయ్, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం సీఎం పెళ్లాం(కామన్ మ్యాన్ పెళ్లాం). వాకాడ అప్పారావు సమర్పణలో ఆర్కే సినిమాస్ బ్యానర్‌పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రమణారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
ఈ నెలాఖరు వరకు ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరగనుందని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో సీనియర్ హీరో సుమన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నగేష్, కోటేశ్వర రావు, సురేశ్ కొండేటి, భరత్, ప్రీతి నిగం, రూపాలక్ష్మి, ప్రజ్ఞ, శాంతి, దాసరి చలపతి రావు, బేబీ హర్షిత, సత్యనారాయణ మూర్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
డైరెక్టర్ రమణారెడ్డి మాట్లాడుతూ..'ఇది వెరైటీ సినిమా అని కానీ చూశాక ప్రేక్షకులే చెబుతారు. డిఫరెంట్ యాంగిల్‌తో పాటు పొలిటికల్ పాయింట్స్ నేపథ్యంలో ఉంటుంది. నిజంగా పదేళ్ల తర్వాత రాజకీయాలు ఎలా ఉంటాయి? ఎలా ఉండబోతున్నాయి? అనే భిన్నమైన కోణంలో ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాం.'అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment