
రావు రమేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం మారుతీనగర్ సుబ్రహ్మణ్యం. ఈ చిత్రాన్ని లక్ష్మణ్ కార్య డైరెక్షన్‌లో తెరకెక్కించారు. ఈ సినిమాను పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ బ్యానర్లపై బుజ్జిరాయుడు పెంట్యాల. మోహన్ కార్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా వర్చువల్‌గా విడుదల చేశారు.
'ఏంటి సుబ్రమణ్యం పొద్దున్నే పూజ మొదలెట్టావా? అగరబత్తి పొగలు కక్కుతోంది.. ఏ బ్రాండో' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. 'నీకు అదృష్టం ఆవగింజంత ఉంటే.. దురదృష్టం ఆకాశమంత ఉందిరా బాబు' అని అన్నపూర్ణమ్మ చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో రావు రమేశ్ యాక్షన్, డైలాగ్, ఫుల్ కామెడీ సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఈ చిత్రంలో ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ కీలక పాత్రల్లో నటించారు. కాగా.. సినిమాను ఆగస్టు 23న ఈ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment