తెలుగులో వస్తోన్న బ్లాక్ బస్టర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్! | Papa Movie Trailer launch by the Director Trinadha Rao Nakkina | Sakshi
Sakshi News home page

Papa Movie Trailer: తెలుగులో వస్తోన్న బ్లాక్ బస్టర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్!

Mar 8 2024 8:48 PM | Updated on Mar 9 2024 2:39 AM

Papa Movie Trailer launch by the Director Trinadha Rao Nakkina - Sakshi

కవిన్, అపర్ణ దాస్, మోనిక చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ్, విటీవి గణేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం పా..పా. ఈ చిత్రాన్ని గణేశ్ కె బాబు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన దా..దా సినిమాను మూవీ నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జెకె ఎంటర్టైన్మెంట్స్ ఎంఎస్. రెడ్డి తెలుగులో  రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను  డైరెక్టర్ త్రినాధ రావు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. 

ఈ సందర్భంగా త్రినాధరావు మాట్లాడుతూ.. 'తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన దా..దా మూవీని తెలుగులో పా..పా..గా మన ముందుకు తీసుకొస్తున్నారు. డైరెక్టర్ గణేష్ కె బాబు ప్రతి సీను చాలా బాగా రాసుకున్నాడు.ఇది ఒక నాన్న కథ మాత్రమే కాదు.. ఒక స్నేహితుడు కథ ఒక ఒక అమ్మ కథ ఒక లవర్ కథ. ఈ సినిమా నేను చూశాను కాబట్టి అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. ఈ సినిమాను ప్రేక్షకులు సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా'అని అన్నారు.

నిర్మాత ఎంఎస్ రెడ్డి మాట్లాడుతూ.. 'డైరెక్టర్ త్రినాధరావుకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. గతంలో సాహసం చేయరా డింభక అనే మూవీతో మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు ఈ పా..పా.. సినిమాతో వస్తున్నాం. ఈ దా..దా.. సినిమాని 50 రోజుల తర్వాత థియేటర్లో చూశాను. ఒక మంచి సినిమా చూశానని అనిపించింది. చెప్పగానే నా యూఎస్ ఫ్రెండ్స్ కూడా రియాక్ట్ అయ్యి తెలుగులో తీసుకొద్దామన్నారు. అతి త్వరలో ఈ సినిమాని మీ ముందుకు తీసుకు వస్తున్నాము. ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement