
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన సోషల్ మీడియా పోస్టులపై సినీ నటుడు రావు రమేష్ స్పందించారు. సోషల్ మీడియాలో తనకు ఎటువంటి అకౌంట్స్ లేవని ఆయన స్పష్టం చేశారు. ‘సోషల్ మీడియాలో నా పేరుతో వచ్చిన పోస్టులకు నాకెలాంటి సంబంధం లేదు. నా పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి.. పోస్టులు చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా’అని రావు రమేష్ మీడియాకు వెల్లడించారు. కాగా, రావు రమేష్ పేరుతో ట్విటర్‌లో వస్తున్న పోస్టింగుల నేపథ్యంలో.. సదరు ట్విటర్ ఖాతాకు అఫీషియల్ గుర్తింపు లేకపోవడంతో పలువురు ఆయనను సంప్రదించారు. దాంతో తాను ఎలాంటి ట్వీట్లు చేయలేదని, అసలు తనకు సోషల్ మీడియా ఖాతాలేవీ లేవని రావు రమేష్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment