Rao Ramesh As CBI Officer First Look Poster Out In KGF Chapter 2 - Sakshi
Sakshi News home page

KGF Chapter 2: రావు రమేశ్‌ లుక్‌ వచ్చేసింది

Published Tue, May 25 2021 2:16 PM | Last Updated on Tue, May 25 2021 4:12 PM

KGF Chapter 2: Rao Ramesh As CBI Officer First Look Poster Out - Sakshi

కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’. 2018లో విడుదలై  సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన‘కేజీఎఫ్‌’సినిమాకు సీక్వెల్‌ ఇది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను కేజీఎఫ్ టైమ్స్ అనే మ్యాగజైన్స్ ద్వారా మేకర్స్ అభిమానులతో పంచుకుంటున్నారు .
 

తాజాగా టాలీవుడ్ నటుడు రావు రమేశ్‌ పుట్టినరోజు(మే 25) సందర్భంగా తన రోల్‌పై స్పెషల్ మ్యాగజైన్ రిలీజ్ చేసింది కేజీఎఫ్ టీమ్. సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ లుక్‌ని విడుదల చేసింది చిత్ర బృందం . ఈ చిత్రంలో రావు రమేష్ కన్నెగంటి రాఘవన్ అనే పాత్ర పోషిస్తున్నారు. రాకీ కేసును డీల్ చేసే సీబీఐ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ 'అధీరా' పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 16న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఈ సినిమా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement