హీరో రంజిత్, సౌమ్య మీనన్ జంటగా నటించిన చిత్రం 'లెహరాయి'. నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో రామకృష్ణ పరమహంస దర్శకత్వం వహించారు. ఎస్.ఎల్.ఎస్.పతాకంపై మద్దిరెడ్డి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథేంటంటే..
లెహరాయి బేసిక్‌గా తండ్రి కూతుళ్ళ మధ్య కథ. మేఘన(సౌమ్య మీనన్)ని తండ్రి( రావు రమేష్) ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతాడు. ఎంతలా అంటే… తనకు రెండో సంతానం కూడా వద్దు అనేంతగా గారాబంగా పెంచుతాడు. మేఘన కూడా తండ్రి కోరుకున్న విధంగానే ప్రేమకు దూరంగా ఉంటూ వస్తుంది. కానీ అనుకోని పరిస్థితుల వల్ల తన క్లాస్ మేట్ అయిన కార్తీక్(రంజిత్)ని ప్రేమిస్తుంది. ఈ విషయం వేరే వ్యక్తుల ద్వారా మేఘన తండ్రికి తెలుస్తుంది. మరి చివరికి ఏం జరిగింది? కూతురి ప్రేమను తండ్రి అంగీకరిస్తాడా? లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే.. …
ఇందులో హీరోగా నటించిన రంజిత్ స్టూడెంట్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్‌లోనూ మెప్పించాడు. సౌమ్య మీనన్ సంప్రదాయ బద్ధంగా కనిపిస్తూనే కుర్రకారును ఆకట్టుకుంటుంది. రావురమేష్ హీరోయిన్ తండ్రి పాత్రలో నటించాడు. తండ్రీ కూతుళ్ల మధ్య నడిచే సెంటిమెంట్ డ్రామా బాగా పండింది. హీరో తండ్రి పాత్రలో నరేష్ నటన ఆకట్టుకుంటుంది. గగన్ విహారి విలనిజం బావుంది. మిగ్రతా పాత్రధారులు తమ పాత్రల పరిధి వరకు బాగానే చేశారు.
కథ,కథనం.. విశ్లేషణ: తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కే సినిమాలు వెండితెరపై ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. గతంలో ఇదే ఫార్మాట్‌లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ కథ, కథనంలో కొత్తదనం చూపిస్తే ఇలాంటి సినిమాలు విజయం సాధిస్తాయి. కూతురే సర్వస్వం అని ఫీలయ్యే తండ్రికి ఆ అమ్మాయి కాలేజీలో ఓ అబ్బయిని ప్రేమించడం, అది తెలిసి తండ్రి ఎలా రియాక్ట్ అయ్యాడన్నదే కథ. అయితే తండ్ర-కూతుళ్ల మధ్య భావేద్వేగాలపై దర్శకుడు మరికాస్త ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. కొన్ని పాత్రలు అవసరం లేకున్నా కావాలని ఇరికించినట్లు అనిపిస్తుంది. ఆలీ, సత్యం రాజేష్ లాంటి వారితో కామెడీని పండించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment