Leharaayi Movie
-
Leharaayi Movie Review : 'లెహరాయి' మూవీ రివ్యూ
హీరో రంజిత్, సౌమ్య మీనన్ జంటగా నటించిన చిత్రం 'లెహరాయి'. నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో రామకృష్ణ పరమహంస దర్శకత్వం వహించారు. ఎస్.ఎల్.ఎస్.పతాకంపై మద్దిరెడ్డి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం. కథేంటంటే.. లెహరాయి బేసిక్‌గా తండ్రి కూతుళ్ళ మధ్య కథ. మేఘన(సౌమ్య మీనన్)ని తండ్రి( రావు రమేష్) ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతాడు. ఎంతలా అంటే… తనకు రెండో సంతానం కూడా వద్దు అనేంతగా గారాబంగా పెంచుతాడు. మేఘన కూడా తండ్రి కోరుకున్న విధంగానే ప్రేమకు దూరంగా ఉంటూ వస్తుంది. కానీ అనుకోని పరిస్థితుల వల్ల తన క్లాస్ మేట్ అయిన కార్తీక్(రంజిత్)ని ప్రేమిస్తుంది. ఈ విషయం వేరే వ్యక్తుల ద్వారా మేఘన తండ్రికి తెలుస్తుంది. మరి చివరికి ఏం జరిగింది? కూతురి ప్రేమను తండ్రి అంగీకరిస్తాడా? లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. … ఇందులో హీరోగా నటించిన రంజిత్ స్టూడెంట్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్‌లోనూ మెప్పించాడు. సౌమ్య మీనన్ సంప్రదాయ బద్ధంగా కనిపిస్తూనే కుర్రకారును ఆకట్టుకుంటుంది. రావురమేష్ హీరోయిన్ తండ్రి పాత్రలో నటించాడు. తండ్రీ కూతుళ్ల మధ్య నడిచే సెంటిమెంట్ డ్రామా బాగా పండింది. హీరో తండ్రి పాత్రలో నరేష్ నటన ఆకట్టుకుంటుంది. గగన్ విహారి విలనిజం బావుంది. మిగ్రతా పాత్రధారులు తమ పాత్రల పరిధి వరకు బాగానే చేశారు. కథ,కథనం.. విశ్లేషణ: తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కే సినిమాలు వెండితెరపై ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. గతంలో ఇదే ఫార్మాట్లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ కథ, కథనంలో కొత్తదనం చూపిస్తే ఇలాంటి సినిమాలు విజయం సాధిస్తాయి. కూతురే సర్వస్వం అని ఫీలయ్యే తండ్రికి ఆ అమ్మాయి కాలేజీలో ఓ అబ్బయిని ప్రేమించడం, అది తెలిసి తండ్రి ఎలా రియాక్ట్ అయ్యాడన్నదే కథ. అయితే తండ్ర-కూతుళ్ల మధ్య భావేద్వేగాలపై దర్శకుడు మరికాస్త ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. కొన్ని పాత్రలు అవసరం లేకున్నా కావాలని ఇరికించినట్లు అనిపిస్తుంది. ఆలీ, సత్యం రాజేష్ లాంటి వారితో కామెడీని పండించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
‘లెహరాయి’ పెద్ద హిట్ అవ్వాలి: కార్తికేయ
‘కొత్తగా వచ్చే సినిమాలు ఎంత హిట్ అయితే అంతమంది కొత్త నటీనటులు ఇండస్ట్రీకి వస్తారు. ఎంతమంది కొత్తవాళ్లు వస్తే ఇండిస్ట్రీ అంత బాగుంటుంది. లెహరాయి చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని యంగ్ హీరో కార్తికేయ అన్నారు. ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లెహరాయి. డిసెంబర్ 9న లెహరాయి సినిమా విడుదలకానుంది.ఇందులో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది ఈ చిత్ర బృందం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ‘ఒక మంచి మూవీ ను సపోర్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఈ సినిమాకు ఫస్ట్ ఆడియన్ వేణుగోపాల్ గారే. ఇది ఒక మంచి కథ. ఈ కథను పూరి జగన్నాధ్ తీసిన, త్రివిక్రమ్ తీసిన అందరికి నచ్చుతుంది. అంత అద్భుతమైన కథ ఇది’ అని హీరో రంజిత్ అన్నారు. ‘ఈ సినిమాను చాలా మందికి చూపించాను. అందరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఒక సినిమాకు కావాల్సిన అన్ని హంగులు లెహరాయిలో ఉన్నాయి. డిసెంబర్ 9న విడుదలయ్యే ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలి’అని నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. -
ద్యావుడా.. ఒకే రోజు 17 సినిమాలు...ఎందుకిలా?
ఒకే వారంలో నాలుగైదు చిన్న సినిమాలు రిలీజ్ అవ్వడం టాలీవుడ్‌కి కొత్తేమి కాదు. ఒక్కోసారి 7-8 సినిమాలు కూడా రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ వారంతం ఒకటి కాదు రెండు కాదు.. ఒకేసారి 17 సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాయి. టాలీవుడ్లో ఇదో రికార్డు అని చెప్పొచ్చు. సాధారణంగా పండుగ సీజన్స్‌లో పెద్ద సినిమాలు ఎక్కువగా విడుదలవుతాయి కాబట్టి చిన్న చిత్రాలు వెనక్కి తగ్గి.. పోటీలేని టైమ్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఈ క్రమంలో చిన్న చిత్రాల మధ్య బాక్సాఫీస్ వార్ మొదలవుతుంది. ‘తగ్గేదే లే’ అన్నట్లుగా ఒకేసారి ఐదారు బరిలోకి దిగుతాయి. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు సేఫ్ జోన్లోకి వెళ్లిపోతాయి. కానీ నెగెటివ్ టాక్ వస్తే.. మరుసటి రోజే థియేటర్స్ నుంచి బయటకు వెళ్లాల్సిందే. అందుకే పోటీగా ఎక్కువ చిత్రాలు ఉన్నా.. విడుదలకు వెనక్కి తగ్గరు చిన్న నిర్మాతలు. (చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..!) అయితే ఈ వారం మాత్రం బాక్సాఫీస్ పోరు మాములుగా లేదు. ఈ ఏడాది చివరి మాసం కావడం.. సంక్రాంతి బరిలో వరుసగా పెద్ద చిత్రాలు ఉండడంతో.. డిసెంబర్ 9న ఏకంగా 17 చిన్న చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఎన్ని థియేటర్స్ దొరికాయి.. ఎక్కడెక్కడ దొరకలేదు అనే విషయాన్ని పట్టించుకోకుండా.. మన సినిమా విడుదలైతే చాలు..అదే పదివేలు అన్నట్లుగా చిన్న నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాల జాబితాలో గుర్తుందా శీతాకాలం, పంచతంత్రం, ముఖచిత్రం, ప్రేమదేశం, చెప్పాలని ఉంది, లెహరాయి, నమస్తే సేట్జీ, ప్రేమదేశం(ఈ ఓల్డ్ చిత్రం మళ్లీ థియేటర్స్‌లో విడుదలవుతుంది), రాజయోగం, డేంజరస్, విజయానంద్, ఏపీ 04 రామపురం, ఐ లవ్ యు ఇడియట్, మనం అందరం ఒక్కటే, ఆక్రోశం, ఏయ్ బుజ్జి నీకు నేనే, సివిల్ ఇంజనీర్ చిత్రాలు ఉన్నాయి. వీటిలో గుర్తుందా శీతాకాలం, పంచతంత్రం, డేంజరస్తో పాటు మరో రెండు, మూడు చిత్రాలు మాత్రమే ప్రచారం ప్రారంభించాయి. మిగతా చిత్రాలన్ని కేవలం పోస్టర్, ట్రైలర్ విడుదల చేసి నేరుగా థియేటర్స్‌లోకి వస్తున్నాయి. మరి వీటిలో ఏ సినిమాలు ప్రేక్షకులను మెప్పించి విజయం సాధిస్తాయో చూడాలి. -
Leharaayi: ఆకట్టుకుంటున్న ‘బేబీ ఒసే బేబీ’ సాంగ్
రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘లెహరాయి’. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ఎల్ఎస్ మూవీస్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధర్మపురి ఫేమ్ గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామకృష్ణ పరమహంస ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 90వ దశకంలో ట్రెండింగ్‌లో ఉన్న సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించారు. తాజాగా లెహరాయి చిత్రం నుంచి ‘బేబీ ఒసే బేబీ’ మాస్ మెలోడీని విడుదల చేశారు మేకర్స్. ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, సాకేత్, కీర్తన శర్మ ఇద్దరూ తమ మెస్మరైజింగ్ వాయిస్ తో ఆలపించారు. డిసెంబర్ 9న ఈ చిత్రం విడుదల కానుంది. -
ఆకట్టుకుంటున్న ‘లెహరాయి’ ట్రైలర్
రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘లెహరాయి’. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ఎల్ఎస్ మూవీస్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధర్మపురి ఫేమ్ గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామకృష్ణ పరమహంస ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా ఓ యువ జంట కథ అని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. హీరోయిన్ కాలేజీలో చాలామందితో ప్రొపోజల్స్ అందుకుంటుంది. వాటినుంచి తప్పించుకోవడానికి ఆమె ఉద్దేశపూర్వకంగా హీరోకి ఐ లవ్ యు అని చెబుతుంది, అయితే ఆమె తండ్రి తన కుమార్తెపై ఎక్కువ ప్రేమను చూపిస్తుంటాడు. ఉద్దేశపూర్వకంగా చెప్పడం వలన తండ్రి కూతుర్లు ఏమి చేసారు.? కథ ఎటువంటి మలుపులు తిరిగిందని యూత్ ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తుంది. యూత్ ను దృష్టిలో పెట్టుకుని సాగే డైలాగులు రంజిత్, సౌమ్య మీనన్ మధ్య సాగే సంభాషణలు యూత్ ను అలరిస్తాయి. ఫన్ పోర్షన్ కూడా బాగుంది. ట్రైలర్‌కి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాప్ట్‌గా ఉంది. పూర్తి భావోద్వేగాలు, వినోదం మరియు ప్రేమతో నిండిన ఈ యూత్‌ఫుల్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. డిసెంబర్ 9న సినిమా విడుదలవుతోంది. -
‘లెహరాయి’ నుంచి ‘అప్సరస.. అప్సరస’సాంగ్ రిలీజ్
రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘లెహరాయి’. రామకృష్ణ పరమహంస ని దర్శకుడి గా పరిచయం చేస్తూ బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో మద్దిరెడ్డి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అప్సరస అప్సరస’ అనే మరో సాంగ్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. గేయ రచయిత శ్రీమణి రచించిన ఈ పాటని రేవంత్ ఆలపించారు.‘తీపితో తేల్చి చెప్పా.. తొలితీపి నీ పలుకని .. తారనే పిలిచి చూపా ..తొలి తారా నీ నవ్వని’లాంటి లైన్స్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నట్లు, మంచి ఫీల్ ఉన్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు రామకృష్ణ పరమహంస’ తెలిపారు. ఈ చిత్రంలో ధర్మపురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.