ఆకట్టుకుంటున్న ‘లెహరాయి’ ట్రైలర్‌ | Leharaayi Movie Trailer Out | Sakshi
Sakshi News home page

Leharaayi: ఆకట్టుకుంటున్న ‘లెహరాయి’ ట్రైలర్‌

Published Tue, Nov 22 2022 10:58 AM | Last Updated on Tue, Nov 22 2022 11:22 AM

Leharaayi Movie Trailer Out - Sakshi

రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘లెహరాయి’. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్‌ఎల్‌ఎస్‌ మూవీస్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధర్మపురి ఫేమ్ గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామకృష్ణ పరమహంస ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి  విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం  ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.

ఈ సినిమా ఓ యువ జంట కథ అని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.  హీరోయిన్ కాలేజీలో చాలామందితో  ప్రొపోజల్స్ అందుకుంటుంది. వాటినుంచి తప్పించుకోవడానికి ఆమె ఉద్దేశపూర్వకంగా హీరోకి ఐ లవ్ యు అని చెబుతుంది, అయితే ఆమె తండ్రి తన కుమార్తెపై ఎక్కువ  ప్రేమను చూపిస్తుంటాడు. ఉద్దేశపూర్వకంగా చెప్పడం వలన తండ్రి కూతుర్లు ఏమి చేసారు.? కథ ఎటువంటి మలుపులు తిరిగిందని యూత్ ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తుంది. 

యూత్ ను దృష్టిలో పెట్టుకుని సాగే డైలాగులు రంజిత్, సౌమ్య మీనన్ మధ్య సాగే సంభాషణలు యూత్ ను అలరిస్తాయి. ఫన్ పోర్షన్ కూడా బాగుంది. ట్రైలర్‌కి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాప్ట్‌గా ఉంది. పూర్తి భావోద్వేగాలు, వినోదం మరియు ప్రేమతో నిండిన ఈ యూత్‌ఫుల్ ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంది. డిసెంబర్ 9న సినిమా విడుదలవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement