Leharaayi Movie: 'Baby Osey Baby' Full Video Song Released - Sakshi
Sakshi News home page

Leharaayi: ఆకట్టుకుంటున్న ‘బేబీ ఒసే బేబీ’ సాంగ్‌

Published Thu, Dec 1 2022 4:46 PM | Last Updated on Thu, Dec 1 2022 5:25 PM

Baby Osey Baby Full Video Song Released From Leharaayi Movie - Sakshi

రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘లెహరాయి’. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్‌ఎల్‌ఎస్‌ మూవీస్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధర్మపురి ఫేమ్ గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామకృష్ణ పరమహంస ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి  విడుదలైన పోస్టర్లు,  పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.  

90వ దశకంలో ట్రెండింగ్‌లో ఉన్న సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించారు. తాజాగా లెహరాయి చిత్రం నుంచి  ‘బేబీ ఒసే బేబీ’ మాస్ మెలోడీని విడుదల చేశారు మేకర్స్‌.  ఈ పాటకి  కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా,  సాకేత్, కీర్తన శర్మ ఇద్దరూ తమ మెస్మరైజింగ్ వాయిస్ తో ఆలపించారు. డిసెంబర్‌ 9న ఈ చిత్రం విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement