
దివంగత నటులు రావుగోపాలరావుది ప్రత్యేకమైన విలనిజమ్. డిఫరెంట్ డైలాగ్ డెలివరీ, విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారాయన. ఆయన తనయుడు రావు రమేశ్ కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న రావు రమేశ్ తాజాగా తమిళ చిత్రసీమలోకి విలన్‌గా అడుగుపెడుతున్నారు. ‘అఆ, ఛల్ మోహన్‌రంగ’ ఫేమ్ సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రమణియన్ హీరోగా తెరకెక్కనున్న ఓ చిత్రంలో ప్రతినాయకుని పాత్రకు రావు రమేశ్‌ని సంప్రదించారట. ఈ కథ విని, ఎగై్జట్ అయిన రావు రమేశ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట.