Debuts
-
సింగర్‌గా మారిపోయిన టాలీవుడ్ బ్యూటీ.. 'కంగువా'లో (ఫోటోలు)
-
‘మణికే మాగే హితే’ యొహానీకి బాలీవుడ్ బంపర్ ఆఫర్
Manike Mage Hithe Hindi Version: ఇంటర్నెట్ సంచలనం, ప్రముఖ శ్రీలంక సింగర్, రాపర్ యొహానీ డిలోకా డిసిల్వా బంపర్ ఆఫర్ కొట్టేసింది. తన స్వరంతో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపిన ఈ అమ్మడు ఇపుడు బాలీవుడ్ తెరంగేట్రం చేస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ పాటకు హిందీ వెర్షన్ అప్ కమింగ్ మూవీ థాంక్ గాడ్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మణికే మాగే హితే అంటూ తన వాయిస్‌తో ఇంటర్నెట్ ఫిదాచేసిన యొహానీకి బాలీవుడ్ సూపర్ స్టార్లు సైతం ఇంప్రెస్ అయిన సంగతి తెలిసిందే. కోట్లాది వ్యూస్‌ను సాధించిన ఈ పాట బిగ్‌బీ అమితాబ్, పరిణితి చోప్రా, మాధురి దీక్షిత్ , సింగర్ సోనూ నిగమ్ తదితరులు ఈ ఫ్యాన్స్ అయిపోయారంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు యొహానీ పాటకు వచ్చిన రీమేక్ సాంగ్స్ కూడా మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోందంటే ఈ పాట క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇంద్రకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న బాలీవుడ్ సినిమా థ్యాంక్ గాడ్లో అవకాశాన్ని దక్కించుకుంది. ఈ పాటను రష్మి విరాగ్ రాయగా, తనిష్క్ బాగ్చి స్వరపరిచారు. థాంక్ గాడ్ మూవీలో అజయ్ దేవ్‌గణ్, సిద్ధార్థ్ మల్హోత్రా ,రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. -
బౌలింగ్.. బ్యాటింగ్.. క్యాచ్ ; ముగ్గురు డెబ్యూలే
కొలంబో: టీమిండియా, శ్రీలంక మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో లంక ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చేసుచేసుకుంది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో చేతన్ సకారియా వేసిన రెండో బంతిని రమేష్ మెండిస్ గల్లీ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. అక్కడే ఉన్న రుతురాజ్ గైక్వాడ్ దాన్ని క్యాచ్‌గా అందుకున్నాడు. ఇక్కడ విశేషమేమిటంటే షాట్ కొట్టిన రమేష్ మెండిస్, బౌలింగ్ చేసిన చేతన్ సకారియా, క్యాచ్ పట్టిన రుతురాజ్ గైక్వాడ్‌లకు వారి జట్ల తరపున ఇదే డెబ్యూ మ్యాచ్. ఒక మ్యాచ్‌లో ముగ్గురు డెబ్యూ ప్లేయర్ల మధ్య ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం చాలా అరుదు. కాగా ఈ మ్యాచ్ ద్వారా భారత్ తరఫున దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా, చేతన్ సకారియా.. లంక తరపున రమేశ్ మెండిస్ టీ20ల్లో అరంగేట్రం చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 40 పరుగలుతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలవడంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమం అయింది.ఇరు జట్లకు కీలకంగా మారిన చివరి టీ20 నేడు జరగనుంది. -
కొత్త లుక్‌తో ఫేస్బుక్
శాన్ జోసె (అమెరికా): సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ త్వరలో కొత్త లుక్‌తో దర్శనమివ్వనుంది. ఈ డిజైన్‌ను ’ఎఫ్బీ5’గా వ్యవహరిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జకర్బర్గ్ చెప్పారు. ఎఫ్8 పేరిట నిర్వహిస్తున్న వార్షిక టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. కొత్త డిజైన్ పనితీరు మరింత సులభతరంగా, వేగవంతంగా ఉంటుందని ఆయన చెప్పారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా ప్రవేశపెడుతున్నామన్నారు. ఫేస్బుక్ యాప్‌లో ఈ మార్పులు తక్షణం కనిపిస్తాయని, మరికొద్ది నెలల్లో డెస్క్‌టాప్ సైట్లో కూడా వీటిని చూడొచ్చన్నారు. ఫేస్బుక్ డేటింగ్ సర్వీసుల్లో సీక్రెట్ క్రష్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నామని జకర్బర్గ్ చెప్పారు. కొత్తగా బ్రెజిల్, మలేషియా తదితర 14 దేశాల్లో దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ఈ జాబితాలో భారత్ లేదు. మరోవైపు, మెసెంజర్ యాప్‌ను కూడా తేలికగా, వేగవంతంగా మారుస్తున్నామని జకర్బర్గ్ తెలిపారు. భారత్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్‌ను ఈ ఏడాది ఆఖరు నాటికి ఇతర దేశాల్లోనూ ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. మరోవైపు, ప్రైవసీ, డేటా భద్రతపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు జకర్బర్గ్ చెప్పారు. ఎన్నికల వేళ అనుచిత విధానాలతో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయకపోతే కఠిన చర్యలు తప్పవంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కేంద్రం గట్టిగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
అరంగేట్రంలో అత్యధిక స్కోరు
ఇండోర్: మధ్యప్రదేశ్ ఓపెనర్ అజయ్ రొహెరా బరిలోకి దిగిన తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (267 నాటౌట్) సాధించి రికార్డు పుటల్లోకెక్కాడు. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో 21 ఏళ్ల అజయ్ (345 బంతుల్లో 267 నాటౌట్; 21 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు ముంబై ఆటగాడు అమోల్ మజుందార్ (260; హరియాణాపై 1994లో) పేరిట ఉండేది. అజయ్, యశ్ దూబే (139 నాటౌట్; 18 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటికి మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌ను 562/4 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాట్స్‌మెన్ మరోసారి సమష్టిగా చేతులెత్తేయడంతో హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే కుప్పకూలింది. దీంతో మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ 253 పరుగులతో విజయం సాధించింది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగులకే ఆలౌటైంది. -
కోలీవుడ్‌కి విలన్‌గా...
దివంగత నటులు రావుగోపాలరావుది ప్రత్యేకమైన విలనిజమ్. డిఫరెంట్ డైలాగ్ డెలివరీ, విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారాయన. ఆయన తనయుడు రావు రమేశ్ కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న రావు రమేశ్ తాజాగా తమిళ చిత్రసీమలోకి విలన్‌గా అడుగుపెడుతున్నారు. ‘అఆ, ఛల్ మోహన్‌రంగ’ ఫేమ్ సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రమణియన్ హీరోగా తెరకెక్కనున్న ఓ చిత్రంలో ప్రతినాయకుని పాత్రకు రావు రమేశ్‌ని సంప్రదించారట. ఈ కథ విని, ఎగై్జట్ అయిన రావు రమేశ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. -
స్త్రీలోక సంచారం
స్కూలు నిబంధనల ప్రకారం నీలం రంగు రిబ్బన్లకు బదులుగా నల్లరంగు రిబ్బన్లు కట్టుకుని వచ్చిన నాల్గవ తరగతి విద్యార్థిని జడను స్కూలు టీచరు కత్తిరించిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారంలోని సెయింట్ స్టీఫెన్స్ హైస్కూల్లో జరిగింది! ఇటీవల హిమాయత్ నగర్‌లోని ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లోనూ ఇలాగే ఒక టీచరు.. జడ సరిగా వేసుకురాని నాల్గవ తరగతి విద్యార్థినిని బెత్తంతో కొట్టడాన్ని గుర్తు చేస్తూ, ‘‘డ్రెస్ కోడ్ పెట్టడం ఎందుకు, కోడ్‌ను పాటించడం లేదని పిల్లల్ని దండించడం ఎందుకు అని ఈ సందర్భంగా ‘బాలల హక్కుల సంఘం’ గౌరవాధ్యక్షులు అచ్యుతరావు స్కూలు యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎస్.ఆర్.నగర్లో ఒక ప్రైవేటు స్కూలు టీచరు స్కూలు వెళుతుండగా ముహమ్మద్ సొహెల్ (26) అనే యువకుడు ఆమెను వెంబడిస్తూ, అసభ్యంగా మాట్లాడడమే కాకుండా, ఆమె చెయ్యి పట్టుకున్న నేరానికి పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై సెక్షన్ 354–డి (స్టాకింగ్.. వెంబడించడం) కేసు పెట్టి, పద్నాలుగు రోజులు రిమాండుకు పంపారు. ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లిం జనాభా గల ఇండోనేషియాలో రెండేళ్ల క్రితం మిలియానా అనే 44 ఏళ్ల చైనా సంతతి మహిళ.. స్థానిక మసీదుల లౌడ్ స్పీకర్ల నుంచి శబ్దకాలుష్యం వెలువడుతోందని ఫిర్యాదు చేయడం ద్వారా దైవదూషణకు పాల్పడడమే కాకుండా.. బౌద్ధ, ముస్లిం వర్గాల మధ్య హింస చెలరేగడానికి ఆమె కారణం అయ్యారన్న ఆరోపణలపై ఆనాటి నుండీ కోర్టులో నడుస్తున్న వాదోపవాదాలు ఇవాళ (గురువారం) ఒక కొలిక్కి రాబోతున్నాయి. మసీదు లౌడ్ స్పీకర్లను శబ్దకాలుష్య కారకాలు అనడం ద్వారా ‘దైవదూషణ’ నేరానికి పాల్పడిందంటూ అందిన మరొక ఫిర్యాదుపై పోలీసులు ఈ ఏడాది మే 18న మిలియానా అరెస్టు చేయగా, ఆ నేరానికి గాను ఆమెకు కనీసం ఏడాదిన్న జైలుశిక్ష విధించాలని ప్రతి న్యాయవాదులు కోరుతున్నారు. నార్త్ కరొలినా, పైన్‌విల్‌లోని ఒక షాపింగ్ మాల్లో పిల్లల స్కూలుకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు వచ్చిన షిరెల్ బేట్స్ అనే ‘కవలల గర్భిణి’పై అనుమానంతో మాల్ మేనేజర్ పోలీసును పిలిపించి, ఆమె బట్టల కింద ఏముందో చూపించాలని అడిగించడం, అందుకు సమాధానంగా అమె ‘నా బట్టల కింద ఉన్నది ట్విన్స్’ అని నవ్వుతూ చెప్పినా ఆ పోలీసు వినకపోవడంతో ఆమె తన తన షర్టును కొంత భాగం వరకు పొట్ట పైకి లేపి గర్భాన్ని చూపించాల్సి రావడం వివాదాస్పదం అయింది. అప్పటికే ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆ గర్భిణి, తనను దొంగగా అనుమానించారని కొన్ని నిముషాల తర్వాత ఆలస్యంగా తెలుసుకుని, ఆవేదన చెందడంతో ఆమెకు క్షమాపణ చెప్పిన మాల్ యాజమాన్యం ఆ మేనేజర్‌ను తొలగించి, ఆమె కొనుగోలు చేసిన సామగ్రి అంతటికీ డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేసింది. మగవాళ్లది మాత్రమే అనుకుంటున్న క్రికెట్ సామ్రాజ్యంలోకి కొత్తగా ఇప్పుడు ఇద్దరు మహిళలు కొత్త ‘జాబ్’లోకి వచ్చేందుకు.. నేషనల్ క్రికెట్ అకాడమీ నిర్వహించిన ‘పిచ్ మేకింగ్’ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 16 నుంచి 29 వరకు జరిగిన ఈ పిచ్–మేకింగ్ కోచింగ్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 29 మంది దరఖాస్తు చేసుకోగా అందులో ఇద్దరు మహిళలు.. జసింతా కల్యాణ్ (కర్నాటక), శివాంగీ ఘోష్ (ఒడిశా).. ఉండడంపై బి.సి.సి.ఐ. ‘గ్రౌండ్ అండ్ పిచ్ కమిటీ’ అధికారి ఒకరు హర్షం వ్యక్తం చేశారు. తొలిచిత్రం ‘కేదార్నాథ్’ విడుదలకు ఇంకా సమయం ఉండగానే స్టార్ స్టేటస్‌కి చేరుకున్న సైఫ్ అలీఖాన్, అమృతాసింగ్ (సైఫ్ మాజీ భార్య)ల ముద్దుల కుమార్తె సారా అలీఖాన్‌పై.. సోషల్ మీడియాలో ఆమె సాక్షాత్కారం కోసం.. అభిమానుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది! సారా పుట్టిన రోజైన ఆగస్టు 12న ఆమె ప్రమేయం లేకుండానే అమె ఫ్యాన్స్ ‘సారా అలీ ఖాన్ ఆన్ సోషల్ మీడియా’ అనే హ్యాష్‌టాగ్‌ను సృష్టించి ఆమెకో సామ్రాజ్యాన్ని నిర్మించి ఇవ్వగా.. మరికొందరు, కనీసం తన బర్త్‌డే కైనా సారా ఇంటర్నెట్లో ఒక అకౌంట్ ఒపెన్ చేసి ఉండే బాగుండేది కదా అని పోస్టుల మీద పోస్టుల పెట్టడంతో ఎట్టకేలకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రవేశించి, అభిమానులను పరవశింపజేశారు. నేపాలీ సంతతి భారతీయ నటి మనీషా కొయిరాల జన్మదినం నేడు. సంజయ్‌దత్ జీవిత చరిత్రపై ఇటీవల వచ్చిన రాజ్‌కుమార్ హిరానీ చిత్రం ‘సంజు’లో కనిపించిన మనీషా.. 2012 తర్వాతి నాటి తన క్యాన్సర్ అనుభవాలతో రాస్తున్న ‘ది బుక్ ఆఫ్ అన్‌టోల్డ్ స్టోరీస్’ని ‘పెంగ్విన్’ సంస్థ త్వరలో పుస్తకంగా ప్రచురించబోతోంది. భారతదేశంలోని ఉత్తరాది మహిళల్తో పోల్చి చూస్తే దక్షిణాది మహిళల్లో స్థూలకాయ సమస్య ఎక్కువగా ఉందని ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే’ నిర్వహించిన (ఎన్.ఎఫ్.హెచ్.ఎస్) తాజా అధ్యయనంలో వెల్లడయింది. అధిక బరువు, లేదా స్థూలకాయం ఉన్న మహిళలు కేరళలో 34 శాతం మంది ఉండగా, తర్వాతి మూడు స్థానాల్లో తమిళనాడు (24.4 శాతం), ఆంధ్రప్రదేశ్ (22.7 శాతం), కర్ణాటక (17.3) రాష్ట్రాలు ఉన్నాయని ఎన్.ఎఫ్.హెచ్.ఎస్ పేర్కొంది. -
ఫోర్బ్స్ లిస్ట్ లో 'బాలకృష్ణ'
సింగపూర్ : ప్రముఖ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న పతంజలి ఫోర్బ్స్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. యోగా గురు రామ్ దేవ్ బాబా సహాయకుడు, పతంజలి ఆయుర్వేద సంస్థ సహ వ్యవస్థాపకుడు బాలకృష్ణ ఫోర్బ్స్ లిస్ట్ లో తొలిసారిగా స్థానం సంపాదించారు. సుమారు రూ.16,000 కోట్లు సంపదతో వందమంది ధనవంతుల భారతీయుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో 48వ స్థానంలో నిలిచారు. భారతదేశంలో వేగంగా పెరుగుతున్న వినియోగ వస్తువుల సంస్థల్లో పతంజలి ఒకటని, దీని నికర విలువ ఆధారంగా, సంస్థలో 92 శాతం వాటాను కలిగివున్న బాలకృష్ణను ఎంపిక చేసినట్టు ఫోర్బ్స్ తెలిపింది. రామ్ దేవ్ కు పతంజలి సంస్థలో వాటాలున్నప్పటికీ , బాలకృష్ణ కార్యకలాపాలు నడిపే వ్యక్తి అనీ, కంపెనీ వాస్తవ బ్రాండ్ అంబాసిడర్ అని ఫోర్బ్స్ పేర్కొంది. గత సంవత్సరం 5,000 కోట్ల ఆదాయాన్ని సాధించిన పతంజలి ఈ ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా లయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 22.7 బిలియన్ డాలర్లతో దేశంలో అత్యంత ధనవంతులైన పది మందిలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు.