
Manike Mage Hithe Hindi Version: ఇంటర్నెట్ సంచలనం, ప్రముఖ శ్రీలంక సింగర్, రాపర్ యొహానీ డిలోకా డిసిల్వా బంపర్ ఆఫర్ కొట్టేసింది. తన స్వరంతో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపిన ఈ అమ్మడు ఇపుడు బాలీవుడ్ తెరంగేట్రం చేస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ పాటకు హిందీ వెర్షన్ అప్ కమింగ్ మూవీ థాంక్ గాడ్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
మణికే మాగే హితే అంటూ తన వాయిస్‌తో ఇంటర్నెట్ ఫిదాచేసిన యొహానీకి బాలీవుడ్ సూపర్ స్టార్లు సైతం ఇంప్రెస్ అయిన సంగతి తెలిసిందే. కోట్లాది వ్యూస్‌ను సాధించిన ఈ పాట బిగ్‌బీ అమితాబ్, పరిణితి చోప్రా, మాధురి దీక్షిత్ , సింగర్ సోనూ నిగమ్ తదితరులు ఈ ఫ్యాన్స్ అయిపోయారంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు యొహానీ పాటకు వచ్చిన రీమేక్ సాంగ్స్ కూడా మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోందంటే ఈ పాట క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలోనే ఇంద్రకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న బాలీవుడ్ సినిమా థ్యాంక్ గాడ్‌లో అవకాశాన్ని దక్కించుకుంది. ఈ పాటను రష్మి విరాగ్ రాయగా, తనిష్క్ బాగ్చి స్వరపరిచారు. థాంక్ గాడ్ మూవీలో అజయ్ దేవ్‌గణ్, సిద్ధార్థ్ మల్హోత్రా ,రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment