చేతన్ సకారియా, రుతురాజ్ గైక్వాడ్, రమేష్ మెండిస్
కొలంబో: టీమిండియా, శ్రీలంక మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో లంక ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చేసుచేసుకుంది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో చేతన్ సకారియా వేసిన రెండో బంతిని రమేష్ మెండిస్ గల్లీ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. అక్కడే ఉన్న రుతురాజ్ గైక్వాడ్ దాన్ని క్యాచ్‌గా అందుకున్నాడు. ఇక్కడ విశేషమేమిటంటే షాట్ కొట్టిన రమేష్ మెండిస్, బౌలింగ్ చేసిన చేతన్ సకారియా, క్యాచ్ పట్టిన రుతురాజ్ గైక్వాడ్‌లకు వారి జట్ల తరపున ఇదే డెబ్యూ మ్యాచ్. ఒక మ్యాచ్‌లో ముగ్గురు డెబ్యూ ప్లేయర్ల మధ్య ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం చాలా అరుదు. కాగా ఈ మ్యాచ్ ద్వారా భారత్ తరఫున దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా, చేతన్ సకారియా.. లంక తరపున రమేశ్ మెండిస్ టీ20ల్లో అరంగేట్రం చేశారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 40 పరుగలుతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలవడంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమం అయింది.ఇరు జట్లకు కీలకంగా మారిన చివరి టీ20 నేడు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment