
నటిగా శ్రద్దా దాస్‌కి మంచి పేరుంది. ఇప్పుడామె ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ సింగర్‌గా మారిపోయారు.

దేవీ శ్రీ ప్రసాద్.. ఆమెను గాయనిగా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా చిత్రం కంగువాలో శ్రద్దా దాస్ యోలో అనే సాంగ్ పాడింది.

యూట్యూబ్‌లో రిలీజైన ఈ పాటకు ఇప్పటికే మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

దేవి శ్రీ ప్రసాద్, శ్రద్ధా దాస్, సాగర్ గాత్రం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాకేందు మౌళి సాహిత్యం అందరినీ ఆకట్టుకుంది.

ఈ మధ్యే హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన మ్యూజికల్ ఈవెంట్‌లోనూ డీఎస్పీతో కలిసి శ్రద్ధాదాస్ పాటలను పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే!

కంగువా మూవీ విషయానికి వస్తే.. సూర్య, దిశా పటాని, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 14న రిలీజ్ కాబోతోంది.



















