
Rao Ramesh Remuneration: ప్రముఖ నటుడు రావు రమేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రముఖ నటుడు రావు గోపాలరావు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడగుపెట్టినా నటుడిగానే గుర్తింపు సంపాదించుకున్నారు. గమ్యం, కొత్త బంగారు లోకం వంటి పలు సినిమాలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రకు ఎంపికైనట్లు సమాచారం.
మలయాళ సూపర్ హిట్ నాయట్టు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రావు రమేష్ ప్రముఖ పాత్రలోకనిపించనున్నారట. ఇందుకు గాను ఎక్కువ కాల్షీట్లు ఇవ్వాల్సి ఉండటంతో ఈ సినిమా కోసం ఏకంగా కోటిన్నర పారితోషికం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రెమ్యునరేషన్ విషయంలో ఇది రికార్డ్ అనే చెప్పవచ్చు. స్టార్లకు సమానంగా రావు రమేష్ పారితోషికం అందుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ప్రముఖ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించనున్న ఈ సినిమా త్వరలోనే స్క్రిప్టు పనులు పూర్తి చేసి సెట్స్ పైకి వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment