Rao Ramesh As Gooni Babji In Maha Samudram First Poster Released - Sakshi
Sakshi News home page

Maha Samudram: గూని బాబ్జీగా రావు రమేశ్‌.. ఫస్ట్‌లుక్‌ వైరల్‌

Published Tue, May 25 2021 4:35 PM | Last Updated on Tue, May 25 2021 6:54 PM

Rao Ramesh As Gooni Babji In Maha Samudram First Poster Released - Sakshi

శర్వానంద్, సిద్ధార్థ్‌ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన శర్వా - సిద్దార్ధ్ - అదితి - అనూ ఇమాన్యూయేల్ - జగపతిబాబు ఫస్ట్ లుక్స్ కి మంచి స్పందన వచ్చింది.  

తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న రావు రమేశ్‌ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఆయన పుట్టిన రోజు(మే 25)సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో రావు రమేశ్‌ టక్ చేసుకొని సీరియస్‌గా చూస్తున్నాడు. ఇందులో గూని బాబ్జీగా రావు రమేశ్‌ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. పేరుకు తగ్గట్టే ఆయన గూని తో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయ‌న పాత్ర వ్యంగ్యంగా సాగుతూ నెగెటివ్ ట‌చ్ ఉంటుంద‌ట‌. యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

చదవండి:
 KGF Chapter 2: రావు రమేశ్‌ లుక్‌ వచ్చేసింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement