
ప్రముఖ హరికథా కళాకారిణి, ప్రముఖ నటులు రావు గోపాల్ రావు భార్య కమల కుమారి (73) ఆరోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు రావు రమేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో సహాయ నటుడిగా కొనసాగుతున్నారు. ఎన్నో వేదికలపై హరికథా గానం చేసిన కమల కుమార్ రావు గోపాల్ రావును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొండాపూర్‌లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు.