‘కేజీఎఫ్‌-2’ కీలక పాత్రలో రావు రమేష్‌ | Rao Ramesh To Play Key Role In KGF Chapter 2 | Sakshi
Sakshi News home page

‘కేజీఎఫ్‌-2’ కీలక పాత్రలో రావు రమేష్‌

Published Mon, Feb 10 2020 2:15 PM | Last Updated on Mon, Feb 10 2020 2:34 PM

Rao Ramesh To Play Key Role In KGF Chapter 2 - Sakshi

కన్నడ రాకింగ్‌ స్టార్‌ యశ్‌ నటించిన ‘కేజీఎఫ్‌’ సౌత్‌ ఇండస్ట్రీలో సంచనలం సృష్టించి బాక్సాఫిక్‌ వద్ద రూ.200 కోట్ల వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో యశ్‌ జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఇక ఈ సినిమా సీక్వేల్‌గా కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తొలిభాగం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సొంతం చేసుకోవడంతో అందరి చూపు రెండవ భాగం చాప్టర్‌-2 పైనే ఉంది. దీంతో సెంకడ్‌ పార్టులో ఫేమస్‌ బాలీవుడ్‌ యాక్టర్లు మెరవబోతున్నారు. ఇప్పటికే పవర్‌పుల్‌ యాక్టర్‌ సంజయ్‌దత్‌ విలన్‌ అధీర పాత్రలో నటిస్తుండగా.. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో బాలీవుడ్‌ యాక్టర్‌ రవీనా టాండన్‌ కూడా జాయిన్‌ అయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్‌ ర‌వీనా టాండ‌న్‌తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. (రవీనా ఆగయా)

కాగా ప్రస్తుతం కేజీఎఫ్‌-2లో టాలీవుడ్ వర్సటైల్ నటుడు రావు రమేష్ నటిస్తున్నట్లు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ట్వీట్‌ చేశారు. ఆయనతో దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ.. ‘కేజీఎఫ్‌-2 షూటింగ్‌కు స్వాగతం. ఆయన పాత్ర సినిమాలో ఎలా ఉండబోతుందనేది ప్రేక్షకులకు వదిలేస్తున్నాం. కేజీఎఫ్‌-2లో భాగస్వామ్యమైనందుకు రావు రమేష్‌కు థాంక్యూ’ అంటూ ట్వీట్‌ చేశారు.  దీంతో ఆయన పాత్ర తెరపై ఎలా ఉంటుదనేది ఆసక్తి కరంగా మారింది. హొంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బాసుర్‌ సంగీతం అందిస్తున్నారు. శ్రీనిధి శెట్టి, శరణ్‌ శక్తి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement