ఇందిరా గాంధీ పాత్రలో సీనియర్ హీరోయిన్‌ | Raveena Tandon To Play Indira Gandhi in KGF 2 | Sakshi
Sakshi News home page

ఇందిరా గాంధీ పాత్రలో సీనియర్ హీరోయిన్‌

Published Tue, May 28 2019 1:02 PM | Last Updated on Tue, May 28 2019 1:02 PM

Raveena Tandon To Play Indira Gandhi in KGF 2 - Sakshi

సాండల్‌వుడ్‌లో సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన సినిమా కేజీఎఫ్‌ (కొలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌). యష్‌ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఘన విజయం సాధించింది. దీంతో కేజీఎఫ్‌ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా మరింత ప్రతిష్టాత్మకంగా ఈ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్న మేకర్స్‌.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఫిలిం సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది. పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీకి సంబంధించిన సన్నివేశాలు ఉండనున్నాయి. అందుకే ఆ పాత్రకు ఒకప్పటి స్టార్ హీరోయిన్‌ రవీనా టండన్‌ను తీసుకున్నారట. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement