దర్శకుడు చెప్పినట్టే చేస్తా | rao ramesh about Nanna Nenu Naa Boyfriends movie | Sakshi
Sakshi News home page

దర్శకుడు చెప్పినట్టే చేస్తా

Published Sat, Dec 17 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

దర్శకుడు చెప్పినట్టే చేస్తా

దర్శకుడు చెప్పినట్టే చేస్తా

‘‘నా కూతురు 6వ తరగతి చదువుతోంది. ముద్దుగా ‘మా అమ్మ ఎక్కడ’ అంటుంటాను. ఏ తండ్రికైనా కూతురుతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఈ చిత్రంలో నాది అటువంటి పాత్ర కావడంతో తల్లిదండ్రులు అందరూ తమను తాము చూసుకుంటు న్నారు’’ అన్నారు రావు రమేశ్‌. బండి భాస్కర్‌ దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్‌ నిర్మించిన ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌’లో హీరోయిన్‌ హెబ్బా పటేల్‌ తండ్రిగా రావు రమేశ్‌ నటించారు.

ఈ 16న రిలీజైన ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘ఐదేళ్ల వరకూ ఇలాంటి తండ్రి పాత్ర రాదంటుంటే హ్యాపీగా ఉంది. హెబ్బా, తేజస్వి, అశ్విన్, పార్వతీశం, నోయెల్‌ బాగా నటించారు. ‘దిల్‌’ రాజు సలహాలు వెలకట్టలేనివి. సమష్టి కృషి ఫలితమే ఈ చిత్ర విజయం. ప్రతి సినిమాలోనూ దర్శకుడు చెప్పినట్టు నటిస్తా. మా నాన్నగారి (రావు గోపాలరావు)తో సహా ఎవర్నీ ఇమిటేట్‌ చేయడానికి ప్రయత్నించను. ప్రస్తుతం ‘ఓం నమో వేంకటేశాయ’, ‘కాటమ రాయుడు’, ‘దువ్వాడ జగన్నాథమ్‌’ తదితర చిత్రాల్లో నటిస్తున్నా’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement