parvatisam
-
సారీ.. నేను ఉగ్రవాదిని
‘‘ఇండియాకు వ్యతిరేకంగా నడుచుకునే ఉగ్రవాది పాత్ర చేసినందుకు సారీ. నటుడిగా అన్ని పాత్రలను ఒకేలా చూడాలని ఈ పాత్ర చేశాను’’ అన్నారు మనోజ్ నందం. సాయికిరణ్ అడవి దర్శకత్వంలో ఆది సాయికుమార్, అబ్బూరి రవి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యానరేశ్ ముఖ్యపాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. సినిమాలో నటించిన ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్సే నిర్మాతలు. ‘అతడు, ఛత్రపతి’ సినిమాల్లో హీరో చిన్ననాటి పాత్రలు చేసిన మనోజ్ నందం ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు. మనోజ్ లుక్‌ను విజయ్ దేవరకొండ రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘కేరింత’ సినిమాకు ఆడిషన్ ఇచ్చాను. దురదృష్టవశాత్తు సెలెక్ట్ కాలేదు. మనోజ్, అబ్బూరి రవిగారి లుక్స్ నచ్చాయి’’ అన్నారు. ‘‘బిజీగా ఉన్నప్పటికీ లుక్ రిలీజ్ చేయడానికి అంగీకరించిన విజయ్‌కు థ్యాంక్స్’’ అన్నారు సాయికిరణ్ అడవి. ‘‘ఫస్ట్ టైమ్ బ్యాడ్‌బాయ్ పాత్రలో నటించాను. ఆడియన్స్ నన్ను విలన్‌గా యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు మనోజ్. -
దర్శకుడు చెప్పినట్టే చేస్తా
‘‘నా కూతురు 6వ తరగతి చదువుతోంది. ముద్దుగా ‘మా అమ్మ ఎక్కడ’ అంటుంటాను. ఏ తండ్రికైనా కూతురుతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఈ చిత్రంలో నాది అటువంటి పాత్ర కావడంతో తల్లిదండ్రులు అందరూ తమను తాము చూసుకుంటు న్నారు’’ అన్నారు రావు రమేశ్. బండి భాస్కర్ దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’లో హీరోయిన్ హెబ్బా పటేల్ తండ్రిగా రావు రమేశ్ నటించారు. ఈ 16న రిలీజైన ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘ఐదేళ్ల వరకూ ఇలాంటి తండ్రి పాత్ర రాదంటుంటే హ్యాపీగా ఉంది. హెబ్బా, తేజస్వి, అశ్విన్, పార్వతీశం, నోయెల్ బాగా నటించారు. ‘దిల్’ రాజు సలహాలు వెలకట్టలేనివి. సమష్టి కృషి ఫలితమే ఈ చిత్ర విజయం. ప్రతి సినిమాలోనూ దర్శకుడు చెప్పినట్టు నటిస్తా. మా నాన్నగారి (రావు గోపాలరావు)తో సహా ఎవర్నీ ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించను. ప్రస్తుతం ‘ఓం నమో వేంకటేశాయ’, ‘కాటమ రాయుడు’, ‘దువ్వాడ జగన్నాథమ్’ తదితర చిత్రాల్లో నటిస్తున్నా’’ అన్నారు.