
ప్రేమ ప్రయాణం!
జర్నీ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రం ‘జతకలిసే’. ‘ఐస్‌క్రీమ్’ ఫేం తేజస్వి, అశ్విన్ జంటగా రాకేశ్ శశి దర్శకత్వంలో నరేశ్ రావూరి నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: జగదీశ్, సంగీతం: విక్కీ, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్.