నేరుగా ఓటీటీలోకి రాబోతోన్న ఆలియా మూవీ, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే | Alia Bhatt Darlings Movie Release On Direct OTT On Netflix | Sakshi
Sakshi News home page

Alia Bhatt: నేరుగా ఓటీటీలో రిలీజ్‌ కాబోతోన్న ఆలియా మూవీ, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

Published Tue, May 24 2022 5:56 PM | Last Updated on Tue, May 24 2022 5:58 PM

Alia Bhatt Darlings Movie Release On Direct OTT On Netflix - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ పెళ్లి అనంతరం కూడా వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా మారింది. ‘గంగూభాయ్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి సక్సెస్‌ ఫుల్‌ మూవీస్‌ తర్వాత ఆమె చేసే ప్రాజెక్ట్స్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆలియా తన హాలీవుడ్‌ డెబ్యూ మూవీ హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఎట్టకేలకు ఆమె నటించిన డార్లింగ్స్‌ మూవీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్‌. ఎప్పుడో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం థియేటర్లోకి వస్తుందా? ఓటీటీలో రిలీజ్‌ అవుతుందా? అనేది సస్పెన్స్‌ నెలకొంది.

చదవండి: ఆఫర్ల కోసం చాలామంది హీరోయిన్లు కమిట్మెంట్ ఇస్తారు: డైరెక్టర్‌

ఈ క్రమంలో డార్లింగ్స్‌ మూవీని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్‌ అధికారిక ప్రకటన ఇచ్చారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేయబోతున్నట్లు మేకర్స్‌ స్పష్టం చేశారు. త్వరలోనే విడుదల తేదీ, స్ట్రీమింగ్‌ టైంను వెల్లడిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా ప్రముఖ రైటర్‌ జష్మీత్‌ కీ రీన్‌ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈసినిమాలో ఆలియా లీడ్‌ రోల్‌ పోషిస్తుండగా.. నటి షెఫాలీ షా, విజయ్‌ వర్మ, రోషల్‌ మాథ్యూలు కీ రోల్‌ పోషిస్తున్నారు. కామెడీ, సస్సెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీని బాలీవుడ్‌ బాద్‌ షారుఖ్‌ ఖాన్‌ తన సొంత నిర్మాణ సంస్థ రెడ్‌చీల్లి ఎంటర్‌టైన్మెంట్‌లో తెరకెక్కించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement