అక్కా తమ్ముడి కథతో ఆలియా భట్ 'జిగ్రా' | Alia Bhatt Jigra Trailer Telugu | Sakshi
Sakshi News home page

Jigra Trailer: బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ మూవీలో ఆలియా

Published Sun, Sep 15 2024 6:11 PM | Last Updated on Sun, Sep 15 2024 6:12 PM

Alia Bhatt Jigra Trailer Telugu

ఆలియా భట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఈమెకు తెలుగులోనూ బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇందుకు తగ్గట్లే రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్'లోనూ యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్, చరణ్ కొత్త సినిమాల్లో హీరోయిన్ అంటూ రూమర్స్ వచ్చాయి. సరే ఇవన్నీ పక్కనబెడితే 'జిగ్రా' అనే ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ ఆలియా చేసింది. రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆలియా యాక్షన్ సీన్స్ గట్టిగానే చేసినట్లుంది.

(ఇదీ చదవండి: కొడుకు ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్ అమలాపాల్)

ట్రైలర్ విషయానికొస్తే.. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథలైన అక్కా తమ్ముడు. ఒకరంటే ఒకరికి ప్రాణం. బంధువుల దగ్గర పెరుగుతారు. పెద్దయిన తర్వాత తమ్ముడు డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుని జైలుకెళ్తాడు. అక్కకేమో తమ్మడంటే పంచ ప్రాణాలు. కానీ అతడిని ఉరి తీయడానికి పోలీసులు సిద్ధమవుతారు. మరి చివరకు అక్కాతమ్ముడు కలిశారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.

కంటెంట్ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతం జనాలు ఆదరిస్తున్నారు. ఆలియా భట్ 'జిగ్రా' ట్రైలర్ చూస్తే హిట్ కళ కనిపిస్తుంది. లెక్క ప్రకారం 'దేవర'తో పాటే రిలీజ్ కావాలి. కానీ రెండు వారాలు వెనక్కి జరిగి అక్టోబరు 11న థియేటర్లలోకి రానుంది. హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. మరి ఆలియా 'జిగ్రా'తో ఏం చేస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: బిగ్ బాస్ 8లో రెండో ఎలిమినేషన్.. కొత్త ట్విస్ట్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement