Jigra Trailer: యాక్షన్‌తో అదరగొట్టిన ఆలియా | Alia Bhatt Jigra Movie Official Trailer Out, Watch Trailer And Its Highlights Inside | Sakshi
Sakshi News home page

Jigra Trailer: యాక్షన్‌తో అదరగొట్టిన ఆలియా

Sep 27 2024 3:29 PM | Updated on Sep 27 2024 3:51 PM

Alia Bhatt Jigra Movie Trailer Out

ఆలియా భట్‌ ప్రధాన పాత్రధారిగా, వేదంగ్‌ రైనా మరో కీలక పాత్రలో నటించిన హిందీ చిత్రం ‘జిగ్రా’. ‘మౌనిక ఓ మై డార్లింగ్, పెడ్లర్స్‌’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వాసన్‌ బాల ‘జిగ్రా’ చిత్రాన్ని తెరకెక్కించారు. కరణ్‌ జోహార్, అపూర్వ మెహతా, ఆలియా భట్, షాహిన్‌ భట్, సోమెన్‌ మిశ్రా నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 11న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ చిత్రంలో సత్యా ఆనంద్‌ పాత్రలో ఆలియా భట్, అంకుర్‌ ఆనంద్‌ పాత్రలో వేదంగ్‌ రైనా నటించారు. మరణ శిక్ష విధించబడి, జైల్లో మూడు నెలల్లో మరణించనున్న తన తమ్ముణ్ణి ఓ అక్క ఏ విధంగా కాపాడుకుంది? అనే కోణంలో ‘జిగ్రా’ కథ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

 ‘నన్ను నేను ఓ ఎథికల్‌ పర్సన్‌గా ఎప్పుడూ అనుకోలేదు. అంకుర్‌కి సిస్టర్‌గానే అనుకున్నాను, లోపల ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా?, అంత ధైర్యం ఎవరికి ఉంది? నువ్వు నా సిస్టర్‌గా ఉన్నప్పుడు’ అనే డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి. ట్రైలర్‌లో ఆలియా యాక్షన్, ఎమోషనల్‌ సీన్స్‌ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement