స్టార్‌ హీరోయిన్ మూవీ.. ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన రామ్ చరణ్! | Ram Charan Released Alia Bhatt Latest Movie Jigra Telugu Trailer, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Jigra Telugu Trailer: ఆర్ఆర్ఆర్ హీరోయిన్‌ మూవీ.. తెలుగు ట్రైలర్‌ రిలీజ్‌!

Published Sun, Sep 29 2024 4:25 PM | Last Updated on Sun, Sep 29 2024 6:02 PM

Ram Charan Released Alia Bhatt Latest Movie Jigra Telugu Trailer

బాలీవుడ్‌ భామ అలియా భట్‌ నటించిన తాజా చిత్రం జిగ్రా. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్‌ అవుతోంది. ఈనెల 27న విడుదల కావాల్సిన జిగ్రా.. దేవర ఎంట్రీతో బాక్సాఫీస్ నుంచి తప్పుకుంది. ఈ చిత్రంలో వేదాంగ్‌ రైనా కీలక పాత్ర పోషిస్తున్నాడు.  వాసన్‌ బాలా దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, ఎటర్నల్ సన్‍షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షహీన్ భట్, సౌమెన్ మిశ్రాతో పాటు ఆలియా భట్ కూడా నిర్మాత వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ విడుదల చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. జిగ్రా తెలుగు వర్షన్‌ థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‍మెంట్ సంస్థ సొంతం చేసుకుంది. అక్టోబర్‌ 11న దసరా సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది. కాగా.. సినిమాలో భారీ యాక్షన్‌తో కూడిన స్టంట్స్‌ కూడా ఆలియా భట్ చేశారు. తన తమ్ముడిని రక్షించుకునేందుకు ఆమె చేసిన సాహసం ఎలాంటిదో ఈ చిత్రంలో దర్శకుడు చూపించారు. ఇప్పటికే విడుదలైన హిందీ ట్రైలర్‌పై చాలామంది బాలీవుడ్‌ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement