రోడ్డుపై చెత్తని సేకరిస్తున్న తెలుగు నటి.. ఎందుకో తెలుసా? | Anchor Jhansi Collect Road Side Waste For Nature | Sakshi
Sakshi News home page

Jhansi: చెత్తని సేకరించిన టాలీవుడ్ నటి-యాంకర్.. వీడియో వైరల్

Mar 5 2024 12:56 PM | Updated on Mar 5 2024 1:26 PM

Anchor Jhansi Collect Road Side Waste For Nature - Sakshi

తెలుగు యాంకర్ కమ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ.. రోడ్డుపై చెత్త సేకరిస్తూ కనిపించింది. మీరు విన్నది నిజమే. అయితే ఇది ఏ సినిమా కోసమే చేసిన సీన్ అయితే కాదులేండి. నిజంగానే తన పనివాడితో కలిసి రోడ్డుపై ఉన్న ఎండుగడ్డి, ఎండిపోయిన అరటి ఆకుల్ని మొత్తం తన కారులో ఎక్కించుకుంది. ఇంతకీ ఇలా ఎందుకు చేసిందో తెలుసా?

(ఇదీ చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో చరణ్‌ని అవమానించిన షారుక్.. షాకింగ్ పోస్ట్)

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత నటీనటులు అందరూ గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేసి.. నెటిజన్స్‌కి అందుబాటులో ఉంటారు. కొందరు మాత్రం రొటీన్‌కి భిన్నంగా ఉండే వీడియోస్ చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. గత కొన్నాళ్ల నుంచి యాంకర్ కమ్ నటి ఝాన్సీ కూడా వ్యర్థాలు వాటితో ఉపయోగాల్లాంటి వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా రోడ్డుపై పడి ఉన్న ఎండుగడ్డి, ఎండిపోయిన అరటి ఆకుల్ని సేకరించి.. కారులో తన ఇంటికి పట్టుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని పోస్ట్ చేసి వాటిని ఎందుకు సేకరించాల్సి వచ్చిందో క్లారిటీగా చెప్పుకొచ్చారు. 'ఎండు గడ్డిని, ఆకులను కాల్చి బూడిద చేయకండి. అవి మన మట్టికి చాలా ఉపయోగపడతాయి. అవి ప్రకృతి సమతౌల్య సూత్రం' అని ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియని విషయాన్ని చెప్పుకొచ్చారు. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఊరి పేరు భైరవకోన' సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement