
ఝాన్సి: ఉత్తర ప్రదేశ్‌లో మహిళలపై వేధింపుల పర్వం కొనసాగుతోంది. తన ప్రేమను నిరాకరించిందని ఓ యువతిని తుపాకీతో కాల్చి చంపాడో ప్రబుద్ధుడు. అనంతరం తనని తాను కాల్చుకున్నాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన ఝాన్సిలోని మేవాటిపుర కాలనీలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పంచవటి కాలనీకి చెందిన రోహిత్(24) మేవాటిపురకు చెందిన (21) యువతిని గత కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.
ఈ క్రమంలో శనివారం రాత్రి యువతి ఇంటి సమీపంలో ఆమెను అడ్డుకున్న యువకుడు తనను ప్రేమించాల్సిందిగా బలవంత పెట్టాడు. దీనికి యువతి నిరాకరించడంతో.. కోపోద్రిక్తుడై తన వెంట తెచ్చుకున్న తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆమె అక్కడికక్కడే మృతిచెందగా.. అనంతరం తనని తాను కాల్చుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment