Anjali Starrer 'Jhansi' Web Series Sequel Will Be Shot Soon Says Producer - Sakshi
Sakshi News home page

Anjali : అంజలి సూపర్‌ హిట్‌ వెబ్‌సిరీస్‌ 'ఝాన్సీ'కి సీక్వెల్‌

Published Mon, Jan 30 2023 9:39 AM | Last Updated on Mon, Jan 30 2023 10:19 AM

Anjali Starrer Jhansi Sequel Will Be Shot Soon Says Producer - Sakshi

తమిళ సినిమా: నటి అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ఝాన్సీ. ట్రైబల్‌ హార్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌పై నటుడు కృష్ణ నిర్మిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌కు తిరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ మొదటి భాగం డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అయ్యి విశేష ఆదరణను పొందింది. తాజాగా ఝాన్సీ రెండో భాగం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అదే ఓటీటీలో స్ట్రిమింగ్‌ అవుతోంది.

ఈ సందర్భంగా వెబ్‌ సిరీస్‌ నిర్మిస్తున్న కృష్ణ మాట్లాడుతూ.. నిజానికి ఈ వెబ్‌ సిరీస్‌ను తెలుగులో రూపొందిస్తున్నామని.. తమిళం, హిందీ భాషల్లో అనువాదంగా స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లు చెప్పారు. యాక్షన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌ తొలి భాగం కంటే రెండో భాగానికి మరింత ఆదరణ లభిస్తోందని అన్నారు. ఝాన్సీ వెబ్‌ సిరీస్‌ మూడో భాగాన్ని రూపొందిస్తామని చెప్పారు. నిర్మాతగా కొనసాగుతున్న తాను కథానాయకుడిగా నటించిన మూడు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయని తెలిపారు.

త్వరలోనే తాను నటించే నూతన చిత్రం వివరాలను వెల్లడిస్తానని కృష్ణ చెప్పారు. దర్శకుడు తిరు మాట్లాడుతూ.. దీన్ని తెలుగులో రపొందించినా తమిళ ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఇప్పుడు హిందీలోన మంచి ఆదరణ లభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ కోసం ఎంతగానో శ్రమించిన నటి అంజలి, చాందిని, యూనిట్‌ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement