Heroine Anjali
-
హీరోయిన్ అంజలి పెళ్లి కుదిరిందా? మెహందీ ఫోటోలు వైరల్
పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి అంజలి టాలీవుడ్లో కంటే కోలీవుడ్‌లో బాగా పాపులారిటీ సంపాదించుకుంది.విభిన్నమైన పాత్రలతో తమిళంలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక తెలుగులో సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లతోనూ ఆకట్టుకుంది. ఇక అంజలి సినిమాల విషయం పక్కనపెడితే కొంతకాలంగా ఆమె పెళ్లిపై పలు వదంతులు షికార్లు చేస్తున్నాయి. ఆ మధ్య ప్రేమ వ్యవహారంలోనూ వార్తల్లో నిలిచిన అంజలి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మెహిందీ ఫోటోలను అంజలి షేర్ చేయడంతో ఆమె పెళ్లి వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. తన వ్యక్తిగత విషయాలను సినిమా విషయాలను ఎప్పటికప్పుడు పంచుకునే అంజలి తాజాగా కొన్ని మెహందీ ఫోటోలను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు అంజలికి పెళ్లి కుదిరిందా అని చర్చిస్తున్నారు. అయితే ఆ ఫోటో అంజలి మెహేంది ఫంక్షన్ కి సంబంధించినవి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.తమిళ కొత్త సంవత్సరం కావడంతో అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన అంజలి ఇలా తన మెహందీ ఫోటోలను పంచుకుంది. దీనికి క్యాప్షన్ కూడా ఇవ్వడంతో అంజలి పెల్లి వార్తలపై క్లారిటీ వచ్చినట్లయ్యింది. View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) -
అంజలి సూపర్ హిట్ వెబ్‌సిరీస్ 'ఝాన్సీ'కి సీక్వెల్
తమిళ సినిమా: నటి అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ ఝాన్సీ. ట్రైబల్ హార్స్ ఎంటర్టైన్మెంట్పై నటుడు కృష్ణ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు తిరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ మొదటి భాగం డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యి విశేష ఆదరణను పొందింది. తాజాగా ఝాన్సీ రెండో భాగం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అదే ఓటీటీలో స్ట్రిమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా వెబ్ సిరీస్ నిర్మిస్తున్న కృష్ణ మాట్లాడుతూ.. నిజానికి ఈ వెబ్ సిరీస్‌ను తెలుగులో రూపొందిస్తున్నామని.. తమిళం, హిందీ భాషల్లో అనువాదంగా స్ట్రీమింగ్ చేస్తున్నట్లు చెప్పారు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ వెబ్‌సిరీస్ తొలి భాగం కంటే రెండో భాగానికి మరింత ఆదరణ లభిస్తోందని అన్నారు. ఝాన్సీ వెబ్ సిరీస్ మూడో భాగాన్ని రూపొందిస్తామని చెప్పారు. నిర్మాతగా కొనసాగుతున్న తాను కథానాయకుడిగా నటించిన మూడు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయని తెలిపారు. త్వరలోనే తాను నటించే నూతన చిత్రం వివరాలను వెల్లడిస్తానని కృష్ణ చెప్పారు. దర్శకుడు తిరు మాట్లాడుతూ.. దీన్ని తెలుగులో రపొందించినా తమిళ ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఇప్పుడు హిందీలోన మంచి ఆదరణ లభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ వెబ్ సిరీస్ కోసం ఎంతగానో శ్రమించిన నటి అంజలి, చాందిని, యూనిట్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. -
హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న అంజలి 'ఫాల్' వెబ్‌సిరీస్
తమిళసినిమా: నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ఫాల్. ఎస్పీబీ చరణ్, నటి సోనియాఅగర్వాల్, సంతోష్ ప్రతాప్, నమిత కృష్ణమూర్తి, పూర్ణిమా భాగ్యరాజ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ వెబ్ సీరీస్‌ను డిస్నీ హాట్‌స్టార్ సంస్థ నిర్మించింది. దీని ద్వారా ప్రముఖ ఛాయాగ్రాహకుడు సిద్ధార్థ్ రామస్వామి దర్శకుడుగా పరిచయమయ్యారు. ఈ వెబ్ సిరీస్ శుక్రవారం నుంచి డిస్నీ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గురువారం రాత్రి చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో డిస్నీ హాట్‌స్టార్ సంస్థ నిర్వాహకులు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న నటి అంజలి మాట్లాడుతూ తాను ఇందులో దివ్య అనే పాత్రలో నటించానని చెప్పారు. ఇది రొటీన్ పాత్రలకు భిన్నంగా, కాస్త చాలెంజింగ్‌గా ఉంటుందన్నారు. థ్రిల్లర్ కథా చిత్రాలను ఇష్టపడే వారికి ఇది కచ్చితంగా నచ్చుతుందన్నారు. ఇందులో నటించిన నటినటీలందరికీ ప్రాముఖ్యత ఉంటుందన్నారు. పూరి్ణమా భాగ్యరాజ్‌తో కలిసి నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు. ఆమె మంచి కథలను చెప్పేవారని, తన లవ్‌స్టోరీ కూడా దాచుకోకుండా చెప్పారన్నారు. డిస్నీ హాట్‌స్టార్ సంస్థలో తాను నటించిన రెండవ వెబ్ సిరీస్ ఇది అని చెప్పారు. చాలా కంఫర్టబుల్‌గా చూసుకునే సంస్థ ఇది అని తెలిపారు. దర్శకుడు సిద్ధార్థ రామస్వామి గురించి చెప్పాలంటే ఆయన చాలా కూల్ పర్సన్ అని పేర్కొన్నారు. తనే చాయాగ్రాహకుడు కావడంతో సన్నివేశాల చిత్రీకరణలో చాలా పర్ఫెక్ట్గా ఉండేవారన్నారు. టెక్నికల్‌గా కూడా తమకు నటించడం చాలా ఈజీ అయ్యిందన్నారు. వన్ మోర్ టేక్ అన్నదే చేసేవారు కాదని చెప్పారు. ఆయన దర్శకత్వంలో పనిచేయడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. -
నడిరోడ్డుపై డాన్స్ చేస్తా..!
సినిమా: నడిరోడ్డుపై డాన్స్ చేస్తా అంటోంది నటి అంజలి. కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా బాధ అంతా ఇంతా కాదు. ఎంతోమందిని ఈ వైరస్ పొట్టన పెట్టుకుంటోంది. మరి ఎంతోమందిని ఆర్థిక సమస్యలకు గురి చేస్తోంది. ఇక పలువురికి అసహనానికి గురి చేస్తోంది. ఇలా ఈ మహమ్మారితో అందరూ ఏదో విధంగా బాధింపునకు గురవుతున్నారు. దీనిని అరికట్టడానికి ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా పాటుపడుతున్నాయి. అయినా ఇది ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన పలువురు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక ఆర్థికంగా బలపడిన నటీనటులు కూడా కరోనా దెబ్బకు ఇంటిలోనే మగ్గిపోతున్నారు. చాలామంది ఇంటి పనులు, శారీరక వ్యాయామాలు, యోగాతో కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు సామాజిక మాధ్యమాలలో తమ ఫొటోలను పోస్టు చేస్తూ అభిమానంతో ముచ్చటిస్తూ కాలం గడుపుతున్నారు. అలా అంజలి కూడా ఇంటి పనులు, కసరత్తులు, డాన్స్‌లతో టైంపాస్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తన ఇన్‌స్ట్ర్రాగామ్‌లో తాను మిద్దెపై డాన్స్ చేస్తున్న ఫొటోను పోస్టు చేసింది. అందులో అంజలి పేర్కొంటూ కరోనా సమస్య ముగిసిన వెంటనే బయటికి వచ్చి నడిరోడ్డుపై డాన్స్ చేయాలనుందని పేర్కొంది. ఈ కరోనా కాలంలో ఈ అమ్మడు అంతగా బోర్‌గా ఫీల వుతోందన్నమాట. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో మూడు చిత్రాలు, తెలుగులో మూడు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. అదే విధంగా నటి అనుష్కతో కలిసి నటించిన సైలెన్స్ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. View this post on Instagram Once this ends I wll celebrate like this 💃🏻 till then #throwback #dance #pic 🤷🏻♀️ #happy #sunday A post shared by Anjali (@yours_anjali) on Jul 12, 2020 at 4:11am PDT -
ఇంట్లో కూర్చోను
ఎవరైనా హీరో, హీరోయిన్ వరుసగా సినిమాలు చేస్తే వాళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అంటూ వార్తలు బయటికొస్తుంటాయి. తమిళ హీరో జై, నటి అంజలి కూడా ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా వినిపిస్తున్న వార్తే. అయితే ఇటీవలే ‘నేను సింగిల్’ అని జై పేర్కొన్నారు. లేటెస్ట్గా అంజలి పెళ్లి చేసుకోబోతున్నారు, ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతారు అనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ‘‘పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలు ప్రస్తుతానికి లేవు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా యాక్టింగ్‌ని కొనసాగిస్తాను. చాలామంది హీరోయిన్లు పెళ్లైనా యాక్ట్ చేస్తున్నారు కదా. నేనెందుకు ఇంట్లో కూర్చోవాలి?’’ అని సమాధానం ఇచ్చారు అంజలి. -
రెండుసార్లు మిస్సయ్యా!
హీరోయిన్ అంజలి... పదహారణాల తెలుగమ్మాయి. తమిళ సినిమా వాకిట్లో... తెలుగు సిరిమల్లె చెట్టు. ‘షాపింగ్ మాల్’, ‘జర్నీ’తో దక్షిణాది ప్రేక్షకుల మనసు దోచిన అభినయాంజలి. బాలకృష్ణ సరసన ‘డిక్టేటర్’తో ఈ 14న సంక్రాంతి వేళ... మన వాకిళ్ళలో బాక్సాఫీస్ ముగ్గు వేస్తున్న సౌందర్యాంజలి. ఆమె ‘డిక్టేటర్’ అనుభవాలు... మనసులోని ముచ్చట్లలో మచ్చుకు కొన్ని... బాలకృష్ణ గారితో ఇది నా మొదటి సినిమా. నిజానికి, గతంలో రెండుసార్లు ఆయనతో కలసి నటించే ఛాన్స్‌లు మిస్సయ్యా. ‘లెజెండ్’లో రాధికా ఆప్టే నటించిన పాత్రకు అడిగారు. కుదరలేదు. అలాగే, ‘లయన్’లో హీరోయిన్గా అడిగినప్పుడు డేట్స్ప్రాబ్లమ్. చివరికి ‘డిక్టేటర్’తో కుదిరింది. మొదట భయపడ్డా! బాలకృష్ణ గారితో సినిమా అనగానే, ‘ఆయన పెద్ద హీరో. సెట్స్‌పై ఎలా ఉంటారో ఏమిటో’ అని భయపడిన మాట నిజం. అలాగే, బయట చాలామంది దగ్గర ఆయన గురించి విన్న మాటలతో టెన్షన్‌పడుతూ వెళ్ళాను. కానీ, బయట అనుకొనేదానికీ, నిజానికీ చాలా తేడా ఉంది. ఆయన చాలా స్వీట్ పర్సన్. తోటి నటీనటులకు చాలా స్పేస్ ఇస్తారు. సెట్స్‌లో నటిస్తున్నప్పుడు మనకు మంచి టిప్స్ ఇస్తారు. మనం ఒకటికి రెండు టేక్‌లు తీసుకున్నా, విసుక్కోకుండా సహకరిస్తారు. హీరోయిన్ దగ్గర నుంచి లైట్‌మెన్ దాకా ప్రతి ఒక్కరితో బాగుంటారు. స్నేహంగా, జోవియల్‌గా ఉంటారు. ఆయన దగ్గర అది నేర్చుకున్నా! కెమేరా ముందు ఎలా ఉండాలి, ఎమోషన్స్‌లో ఖాళీ వచ్చినప్పుడు వాటిని ఎలా భర్తీ చేసుకోవాలి లాంటి చాలా టిప్స్ ఆయన చెప్పేవారు. ఆయన దగ్గర నుంచి పంక్చువాలిటీ నేర్చుకున్నా. ఫలానా టైమ్‌కి షూటింగంటే, ఆయన షాట్ ఉందా, లేదా అన్నదానితో సంబంధం లేకుండా ఆయన రెడీ అయి, కూర్చొనేవారు. పెద్ద హీరో ఆయనే రెడీగా ఉంటారని, దానికి భయపడి మిగిలినవాళ్ళందరం ఆ టైమ్‌కి సిద్ధంగా ఉండేవాళ్ళం. ♦ నేను ఒక డాక్టర్‌ను చేసుకొని, పిల్లను కనేశానని పుకారొచ్చింది. తాజాగా టీవీ యాంకర్ ఓంకార్ ‘రాజుగారి గది’ సీక్వెల్లో చేస్తున్నా ననీ, ఆయనతో సన్నిహితంగా ఉన్నాననీ నెట్లో రాశారు. అవన్నీ వట్టి పుకార్లే. ♦ నా సహ నటీనటులందరూ నాకు స్నేహితులే. సినిమాలు తెగ చూస్తాను. ఏ సినిమా బాగుంటే ఆ సినిమా నటీనటులకు మెసేజ్‌లు కూడా పెడతాను. అలా పిలవాలంటే కంగారుపడ్డా! తోటి నటీనటుల్ని బాలాగారెంత కంఫర్ట్‌గా ఉంచుతారంటే, నేను ‘బాలకృష్ణ గారూ, సార్’ అని పిలుస్తుంటే నన్ను పిలిచి, ‘కాల్ మి బాలా’ అన్నారు. నేను కంగారుపడిపోయి, అలా పిలవలేనన్నా. చివరికి ‘బాలా గారూ అని పిలుస్తా’ అన్నా. సరే అన్నారు. అలా సాన్నిహిత్యం పెరిగింది. ఆయన అలా పోల్చడం నా అదృష్టం! ‘డిక్టేటర్’ చాలా మంచి స్క్రిప్ట్. రచయిత కోన వెంకట్ గారు కథ వినిపిస్తున్నప్పుడే అది అర్థమైంది. కథ రాస్తున్నప్పుడే ఈ పాత్రకు నేను బాగుంటానని పేరు రాసుకున్నారట. ఢిల్లీలో వర్కింగ్ గర్ల్‌గా నా పాత్ర యూత్‌ఫుల్‌గా, చలాకీగా బాగుంటుంది. పాత్ర పేరు విచిత్రంగా ఉంటుంది. బయటపెట్టలేను కానీ, సినిమాలో ప్రధాన భాగమంతా నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. పైగా, నాలోని నటనను హైలైట్ చేసే సీన్లు ఉన్నాయి. ఎడిటింగ్‌లో, ఆ తరువాత డబ్బింగ్లో అవి చూసిన బాలకృష్ణ గారు నన్ను ‘మహానటి సావిత్రి’తో పోల్చడం, అంత లెజండరీ యాక్టర్‌తో ఆ ప్రశంస అందుకోడం నా అదృష్టం! ఫస్ట్ రోజే టెన్త్ ఎగ్జామ్! ఈ సినిమా సెట్స్‌కు వెళ్ళిన మొదటి రోజే పాట షూటింగ్. పైగా ‘గణ...గణ’ అనే మాస్ బీట్ పాట. అంతే! బాలా గారు మంచి ఎనర్జీతో స్టెప్స్ వేస్తున్నారు. నాకు టెన్ష నొచ్చింది. ఫస్ట్‌రోజే టెన్త్ ఎగ్జామ్ రాస్తున్నట్లనిపించింది. ‘ప్రాక్టీస్ చెయ్. నువ్వు రెడీ అయ్యాక చేద్దా’మని బాలా ప్రోత్సహించారు. అయిదున్నర కిలోలు తగ్గా! ‘డిక్టేటర్’లో వర్కింగ్ గర్ల్ పాత్ర కాబట్టి, ఈ సినిమా అనుకున్నప్పుడే కొంచెం సన్నగా ఉండాలని దర్శక - నిర్మాత శ్రీవాస్ చెప్పారు. అందుకని ప్రత్యేకించి అయిదున్నర కిలోలు తగ్గా. హెయిర్‌స్టైల్, లుక్, శ్యామ్ కె. నాయుడు కెమేరా పనితనంతో తెరపై వేరే కొత్త అంజలిని చూడవచ్చు. ఫ్రెష్‌గా, యంగ్‌గా కనిపిస్తా. ట్రాన్సజెండరూ కాదు... వేశ్యా కాదు..! ఇప్పుడు నా బేస్ హైదరాబాద్. ఇక్కడే ఉంటున్నా. తమిళ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నా కాబట్టి, ఎక్కువ ట్రావెల్ చేస్తున్నా. తెలుగు-తమిళాల్లో ‘చిత్రాంగద’, తమిళంలో కార్తీక్ సుబ్బ రాజు ‘ఇరైవి’ లాంటివి రిలీజ్‌కు సిద్ధమవుతు న్నాయి. మమ్ముట్టి గారితో తమిళ చిత్రం ‘పేరన్బు’ షూటింగ్ మంగళవారం నుంచి. అందులో నాది ట్రాన్సజెండర్ పాత్ర అనీ, వేశ్య పాత్ర అనీ రాస్తు న్నారు. అది నిజం కాదు. కొత్తగా రెండు తెలుగు స్క్రిప్ట్స్ విన్నా. వాటికి సైన్ చేయాలి. -
మళ్ళీ వార్తల్లో నిలిచిన అంజలి