
ఎవరైనా హీరో, హీరోయిన్ వరుసగా సినిమాలు చేస్తే వాళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అంటూ వార్తలు బయటికొస్తుంటాయి. తమిళ హీరో జై, నటి అంజలి కూడా ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా వినిపిస్తున్న వార్తే. అయితే ఇటీవలే ‘నేను సింగిల్’ అని జై పేర్కొన్నారు.
లేటెస్ట్‌గా అంజలి పెళ్లి చేసుకోబోతున్నారు, ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతారు అనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ‘‘పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలు ప్రస్తుతానికి లేవు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా యాక్టింగ్‌ని కొనసాగిస్తాను. చాలామంది హీరోయిన్లు పెళ్లైనా యాక్ట్ చేస్తున్నారు కదా. నేనెందుకు ఇంట్లో కూర్చోవాలి?’’ అని సమాధానం ఇచ్చారు అంజలి.
Comments
Please login to add a commentAdd a comment