పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి అంజలి టాలీవుడ్‌లో కంటే కోలీవుడ్‌లో బాగా పాపులారిటీ సంపాదించుకుంది.విభిన్నమైన పాత్రలతో తమిళంలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక తెలుగులో సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లతోనూ ఆకట్టుకుంది. ఇక అంజలి సినిమాల విషయం పక్కనపెడితే కొంతకాలంగా ఆమె పెళ్లిపై పలు వదంతులు షికార్లు చేస్తున్నాయి. ఆ మధ్య ప్రేమ వ్యవహారంలోనూ వార్తల్లో నిలిచిన అంజలి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా మెహిందీ ఫోటోలను అంజలి షేర్ చేయడంతో ఆమె పెళ్లి వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. తన వ్యక్తిగత విషయాలను సినిమా విషయాలను ఎప్పటికప్పుడు పంచుకునే అంజలి తాజాగా కొన్ని మెహందీ ఫోటోలను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు అంజలికి పెళ్లి కుదిరిందా అని చర్చిస్తున్నారు.
అయితే ఆ ఫోటో అంజలి మెహేంది ఫంక్షన్ కి సంబంధించినవి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.తమిళ కొత్త సంవత్సరం కావడంతో అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన అంజలి ఇలా తన మెహందీ ఫోటోలను పంచుకుంది. దీనికి క్యాప్షన్ కూడా ఇవ్వడంతో అంజలి పెల్లి వార్తలపై క్లారిటీ వచ్చినట్లయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment