
జ్యోతిక
జ్యోతిక ముఖ్య పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘నాచియార్’. బాలా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని యశ్వంత్ మూవీస్, కల్పనా చిత్ర బ్యానర్‌పై ‘ఝాన్సీ’ పేరుతో డి. అభిరాం అజయ్‌కుమార్, కోనేరు కల్పన తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది.
పోలీసాఫీసర్ పాత్రలో జ్యోతిక టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించారు. జ్యోతిక యాక్షన్, డైలాగ్స్ చూస్తుంటే తనలో నన్ను నేను చూసుకున్నా అని హీరో సూర్య అన్నారు. ఏ పాత్రనైనా ఛాలెంజింగ్‌గా చేయగల జీవీ ప్రకాష్ నటన ప్రేక్షకులను మెప్పించింది. ఇళయరాజాగారి సంగీతం ఈ సినిమా సక్సెస్‌కి ప్రధాన కారణం. త్వరలోనే ‘ఝాన్సీ’ టీజర్ రిలీజ్ చేయనున్నాం. చాలా రోజుల తర్వాత తెలుగులో వస్తున్న జ్యోతిక చిత్రం మాదే’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: యశ్వంత్ మూవీస్.
Comments
Please login to add a commentAdd a comment