
కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బాల దర్శక నిర్మాతగా తెరకెక్కించిన సినిమా నాచియార్. తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాను తెలుగులో డి.వి.సినీ క్రియేషన్స్ బ్యానర్ రిలీజ్ చేస్తున్నారు. క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటి జోత్యిక పోలీసాఫీసర్ పాత్రలో నటించారు. రిలీజ్‌కు ముందు వివాదాస్పదమైన జ్యోతిక పాత్రకు సినిమా రిలీజ్ తరువాత మంచి ప్రశంసలు దక్కాయి.
యువ నటుడు జీవీ ప్రకాష్ మరో కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతమందించటం విశేషం. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్‌ను ఝాన్సీ పేరుతో విడుదల చేస్తున్నారు. చాలా కాలం తరువాత జ్యోతిక తెలుగు తెర మీద కనిపించనుండటం సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. త్వరలోనే టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment