
తమిళసినిమా: నటి జ్యోతిక, దర్శకుడు బాలాపై మరో కేసు నమోదైంది. బాలా దర్శకత్వంలో నటి జ్యోతిక ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం నాచియార్. ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై కలకలాన్ని రేకెత్తిస్తోంది. అందులో పోలీస్ అధికారిగా నటిస్తున్న జ్యోతిక పోలీస్‌స్టేషన్‌లో కొందరు మహిళలను అసభ్య పదజాలతో దూషించిన సన్నివేశంపై ప్రజల్లో తీవ్రవ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ అంశంపై మేటుపాలెంకు చెందిన డ్రైవర్ రాజన్ స్థానిక జ్యుడీషియల్ మ్యాజిస్టేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. తాజాగా సోమవారం కరూర్ నేర విభాగ కోర్టులో నటి జ్యోతిక, దర్శకుడు బాలాలపై మరోపిటిషన్ దాఖలైంది. దీన్ని ఇండియా కుడియరసు పార్టీ రాష్ట్ర నిర్వాహకుడు దళిత్ పాండియన్ దాఖలు చేశారు. అందులో నాచియార్ చిత్రంలో నటి జ్యోతిక చెప్పిన సంభాషణలు మహిళలను కించపరిచేవిగా, అసభ్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. కావున నటి జ్యోతిక, దర్శకుడు బాలాలపై భారతీయ శిక్షాసృతి చట్టం ప్రకారం 294(పీ), ఐటీ చట్టం2015 విభాగాల్లో కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసు ఈ నెల 29న విచారణకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment