
జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన కోలీవుడ్ మూవీ నాచియార్ చిత్రం తెలుగు లో ఝాన్సీ పేరుతో విడుదల కానుంది. కోనేరు కల్పన, డి.అభిరాం అజయ్ కుమార్‌లు కల్పనా చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ బ్యానర్‌లపై సంయుక్తంగా ఆగస్టు 17న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సంచలన దర్శకుడు బాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు తమిళనాడు మంచి రెస్పాన్స్ వచ్చింది. జ్యోతిక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం మందించగా యువ నటుడు జి వి ప్రకాష్ మరో కీలక పాత్రలో కనిపిస్తారు.