కడుపులో నులిపురుగులను అంతమెందించేందుకు వేసుకున్న మాత్రలు వికటించి 22 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిన్న చోటు చేసుకుంది. ఝాన్సీ జిల్లాలోని బాబినా ప్రాంతంలోని దుర్గాపూర్ గ్రామంలో ఆశీర్వాద్ చైల్డ్ హెల్త్ గ్యారంటీ స్కీమ్ కింద చిన్నారులకు ఆ మాత్రలను అందజేశారు. ఆ మాత్రలు వేసుకోవడంతో వారు తీవ్ర కడుపునొప్పి, తలనొప్పి, వాంతులు, విరోచనాలు మొదలైనాయి. దాంతో ఆ చిన్నారులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పిల్లలకు వెంటనే వైద్యం అందించాలని వారి తల్లితండ్రులు ఆ ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు.
ఆ క్రమంలో వైద్యులను ఆసుపత్రిలో ఆందోళనకారులు నిర్బంధించారు. పోలీసుల జోక్యం చేసుకుని వారిని విడుదల చేశారు. అయితే ఆ విద్యార్థులు తీవ్ర ఆనారోగ్యంపాలైన ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. చిన్నారులు అరోగ్యంగానే ఉన్నారని, దాంతో వారిని డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి వైద్యులు బుధవారం తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు ఆరు కోట్ల చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు అఖిలేష్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో అశీర్వాద్ చైల్డ్ హెల్త్ గ్యారంటీ స్కీమ్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
యూపీలో 22 మంది చిన్నారులకు అస్వస్థత
Published Wed, Aug 7 2013 12:25 PM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
Advertisement
Advertisement