మద్దికెర : అవ్వ మందలించిందని ఓ యువతి హంద్రీ–నీవా కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్‌ఐ మారుతి వివరాల మేరకు.. అనంతపురం జిల్లా గుంతకల్లు చెందిన భీమలింగ కుమార్తె ఝాన్సీ (20) అవ్వతాతల వద్ద(మద్దికెర) ఉంటోంది. ఇటీవల ఆమె సెల్‌ఫోన్‌లో ఎక్కువగా మాట్లడుతుండడంతో అవ్వ ఈశ్వరమ్మ మందలించింది. ఈక్రమంలో ఈనెల 12న గుంతకల్లుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి గ్రామ సమీపంలో ఉన్న హంద్రీ–నీవా కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మనవరాలి ఆచూకీ లభించకపోవడంతో ఈశ్వరమ్మ ఈనెల 15న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా వజ్రకరూర్ వద్ద శుక్రవారం ఝాన్సీ మృతదేహం లభించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment