
హైదరాబాద్: టీవీ నటి నాగఝాన్సీ ఆత్మహత్య కేసులో అరెస్టై చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న ఆమె ప్రియుడు సూర్యతేజను 4 రోజుల పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో పంజగుట్ట పోలీసులు శనివారం అతడిని కస్టడీలోకి తీసుకున్నారు.
నాగ ఝాన్సీ, సూర్యతేజలకు ఎప్పటి నుంచి పరిచయం, ఆత్మహత్య చేసుకునే ముందు సూర్యకు ఫోన్ చేసినా స్పందించకపోవడం, రూ.10 లక్షల విలువైన బంగారాన్ని సూర్యకు ఇచ్చినట్లు ఝాన్సీ తల్లి చేస్తున్న ఆరోపణలపై లోతుగా విచారించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment