Suryateja
-
ఝాన్సీ ఆత్మహత్య కేసులో ప్రియుడికి కస్టడీ
హైదరాబాద్: టీవీ నటి నాగఝాన్సీ ఆత్మహత్య కేసులో అరెస్టై చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న ఆమె ప్రియుడు సూర్యతేజను 4 రోజుల పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో పంజగుట్ట పోలీసులు శనివారం అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. నాగ ఝాన్సీ, సూర్యతేజలకు ఎప్పటి నుంచి పరిచయం, ఆత్మహత్య చేసుకునే ముందు సూర్యకు ఫోన్ చేసినా స్పందించకపోవడం, రూ.10 లక్షల విలువైన బంగారాన్ని సూర్యకు ఇచ్చినట్లు ఝాన్సీ తల్లి చేస్తున్న ఆరోపణలపై లోతుగా విచారించనున్నారు. -
సూర్య వేధింపుల వల్లే ఝాన్సీ ఆత్మహత్య
-
సూర్య వేధింపుల వల్లే ఝాన్సీ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: తెలుగునాట సంచలనం రేపిన టీవీ నటి సువ్వాడ నాగ ఝాన్సీ (21) సూసైడ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె ఆత్మహత్యకు ప్రియుడు సూర్యతేజనే కారణం అని పోలీసులు తేల్చారు. దీంతో అతనిపై ఐపీసీ సెక్షన్ 306, 417 ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సూర్య వేధింపుల కారణంగానే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో తేలింది. ఆమె చనిపోవడానికి కొన్నిగంటల ముందు సూర్యకు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఝాన్సీని సూర్య తీవ్రస్థాయిలో మందలించడంతో మనస్తాపం చెందిన ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్థారించారు. గతకొంత కాలంగా ఝాన్సీని ఆమె ప్రియుడు సూర్య మానసికంగా వేధిస్తున్నాడని, ఆమెకు ఇష్టం లేకున్నా బలవంతంగా నటనను మాన్పించాడని పోలీసులు పేర్కొన్నారు. తనను పెళ్లి చేసుకోవాంటే నటన మానేయాలని ఆంక్షలు విధించాడని, ఆ తరువాత అతను మోసం చేయడంతో ఝాన్సీ ఆత్మహత్య చేసుందని పోలీసులు తెలిపారు. తన కూతురు ఆత్మహత్యకు సూర్యతేజనే పూర్తి కారణమని, నమ్మించి మోసం చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని ఝాన్సీ తల్లి సంపూర్ణ, సోదరుడు దుర్గాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిత్రం సూర్యని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారివద్దనున్న ఆధారలతో ఆయనను అరెస్ట్ చేశారు. -
ఝాన్సీని గిరి చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు..
సాక్షి, హైదరాబాద్ : సంచలనం రేపిన టీవీ సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఝాన్సీ ప్రియుడు సూర్యను ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా సూర్య పలు కొత్త విషయాలు బయటపెట్టాడు. ఝాన్సీకి బాబి, గిరి అనే ఇద్దరు ఫోటో షూట్ చేసేవారని సూర్య తెలిపాడు. అయితే వారిద్దర్నీ నమ్మొద్దని ఝాన్సీని తాను పలుమార్లు హెచ్చరించానన్నాడు. సినిమాల్లో ఆఫర్లు ఇప్పిస్తామని వారు ఆమెను మోసం చేశారని సూర్య తెలిపాడు. (అనుమానమే అవమానమనుకుంది) గిరి పలుమార్లు ఇబ్బంది పెట్టాడని ఝాన్సీకి తనకు చెప్పిందన్నాడు. దాంతో గిరికి ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చానన్నాడు. సినిమా ఆఫర్లు తగ్గడంతోనే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని సూర్య పోలీసుల విచారణలో వెల్లడించాడు. సూర్య చెప్పిన దాని ప్రకారం బాబి, గిరిని కూడా పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకొని విచారించనున్నట్లు సమాచారం. సూర్య ఝాన్సీని ట్రాప్ చేశాడు : దుర్గ మధుతో కలిసి సూర్య ఝాన్సీని ట్రాప్ చేశాడని ఆమె సోదరుడు దుర్గ ఆరోపించారు. సూర్య ముందు మధును ప్రేమించాడని తెలిపారు. ఈ క్రమంలో మధునే.. ఝాన్సీని సూర్యకు పరిచయం చేసిందన్నాడు. ఆ తరువాత సూర్య మధును వదిలేసి ఝాన్సీని ప్రేమించాడని వెల్లడించాడు. మధునే ఝాన్సీని మిస్‌గైడ్ చేసిందని దుర్గ ఆరోపించాడు. -
ఝాన్సీ ఆత్మహత్య కేసు: విచారణలో కొత్త విషయాలు
-
వాళ్లను నమ్మొద్దని చెప్పా: ఝాన్సీ ప్రియుడు సూర్య
సాక్షి, హైదరాబాద్: బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఝాన్సీ ప్రియుడు సూర్య పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ కేసుతో సంబంధం ఉందంటు ఇద్దరి పేర్లను బయటపెట్టాడు. బాబీ, గిరి అనే వ్యక్తులు ఝాన్సీకి ఫోటో షూట్ చేసేవారని తెలిపాడు. బాబీ, గిరిలను నమ్మొద్దని, ఫోటో షూట్లు ఆపేయాలని ఝాన్సీకి చెప్పినట్లు వెల్లడించాడు. గిరి ఇబ్బంది పెడుతున్నాడని ఝాన్సీ తన వద్ద ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. గిరికి వార్నింగ్ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో చెప్పాడు. -
నవ్వించే... ప్రేమకథ
సూర్యతేజ, హర్షికా పూంచా హీరో హీరోయిన్లుగా దుహ్రా మూవీస్ సమర్పణలో జంపా క్రియేషన్స్ పతాకంపై కె.ఆర్ విష్ణు దర్శకత్వంలో ప్రదీప్ కుమార్ జంపా నిర్మించిన చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’. సునీల్ కశ్యప్ స్వరాలు అందించిన ఈ చిత్రం ఆడియో సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఈ 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా అందరికీ నచ్చే చిత్రం అవుతుంది. సునీల్ కశ్యప్ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలుస్తాయి’’ అని తెలిపారు. ‘‘వినోద ప్రధానంగా సాగే ప్రేమకథా చిత్రం ఇది’’ అని దర్శకుడు పేర్కొన్నారు. సూర్యతేజ, హర్షికా పూంచా, సునీల్ కశ్యప్, రామచంద్రారెడ్డి, సత్యదేవ్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లెటూరి ప్రేమకథ
లక్ష్మణ్, సురభిస్వాతి, సూర్యతేజ, నవీనా జాక్సన్ ముఖ్య తారలుగా దర్శకుడు శ్రీఅరుణ్ స్వీయ నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘తప్పటడుగు’. సాయిమధుకర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సంస్థ లోగోను నటుడు రాళ్లపల్లి ఆవిష్కరించగా, దర్శక, నిర్మాత సాయివెంకట్ ఆడియో సీడీని ఆవిష్కరించి, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణకు అందించారు. మానవీయ బంధాల నేపథ్యంలో సాగే పల్లెటూరి ప్రేమకథ ఇదనీ, రంగస్థలం నుంచి ఎన్నుకున్న నటీనటులు కావడంతో అందరూ అద్భుతంగా నటించారనీ, సంగీతం ఈ చిత్రానికి హైలైట్ అనీ శ్రీఅరుణ్ చెప్పారు. -
'పానీపూరి' సినిమా స్టిల్స్
-
వినోదాల ‘పానీపూరి’
‘‘కుటుంబ విలువలతో కూడిన చిత్రమిది. వినోదంతో పాటు చిన్నపాటి సందేశం కూడా ఉంది’’ అని సుమన్ చెప్పారు. సూర్యతేజ, హర్షిక పూంచా జంటగా కేఆర్ విష్ణు దర్శకత్వంలో ప్రదీప్‌కుమార్ జంపా నిర్మిస్తున్న ‘పానీపూరి’ చిత్రం టాకీపార్ట్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘టైటిల్ తరహాలోనే సినిమా ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు. కథే ఈ చిత్రానికి ప్రాణమని, పాటలు మినహా చిత్రీకరణ పూర్తయిందని నిర్మాతలు తెలిపారు. సోలో హీరోగా తనకిది తొలి చిత్రమని సూర్యతేజ చెప్పారు. ఈ సినిమాలో ప్రతి పాత్ర కొత్తగా ఉంటుందని నరేష్ అన్నారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే: కె.బ్రహ్మారెడ్డి, సంగీతం: సునీల్ కశ్యప్.