పల్లెటూరి ప్రేమకథ
లక్ష్మణ్, సురభిస్వాతి, సూర్యతేజ, నవీనా జాక్సన్ ముఖ్య తారలుగా దర్శకుడు శ్రీఅరుణ్ స్వీయ నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘తప్పటడుగు’. సాయిమధుకర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సంస్థ లోగోను నటుడు రాళ్లపల్లి ఆవిష్కరించగా, దర్శక, నిర్మాత సాయివెంకట్ ఆడియో సీడీని ఆవిష్కరించి, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణకు అందించారు. మానవీయ బంధాల నేపథ్యంలో సాగే పల్లెటూరి ప్రేమకథ ఇదనీ, రంగస్థలం నుంచి ఎన్నుకున్న నటీనటులు కావడంతో అందరూ అద్భుతంగా నటించారనీ, సంగీతం ఈ చిత్రానికి హైలైట్ అనీ శ్రీఅరుణ్ చెప్పారు.