సాక్షి, హైదరాబాద్: బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఝాన్సీ ప్రియుడు సూర్య పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ కేసుతో సంబంధం ఉందంటు ఇద్దరి పేర్లను బయటపెట్టాడు. బాబీ, గిరి అనే వ్యక్తులు ఝాన్సీకి ఫోటో షూట్ చేసేవారని తెలిపాడు. బాబీ, గిరిలను నమ్మొద్దని, ఫోటో షూట్‌లు ఆపేయాలని ఝాన్సీకి చెప్పినట్లు వెల్లడించాడు. గిరి ఇబ్బంది పెడుతున్నాడని ఝాన్సీ తన వద్ద ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. గిరికి వార్నింగ్ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment